మంగళవారం కుల్‌భూషణ్ జాదవ్ తల్లి, భార్య విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను న్యూఢిల్లీలోని తన నివాసంలో కలుసుకున్నారు. సోమవారం పాకిస్థాన్ కు వెళ్లి జాదవ్ ను కలిసి వచ్చిన మరుసటిరోజే జాదవ్ తల్లి, భార్య సుష్మా స్వరాజ్ తో సమావేశమయ్యారు. విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్, విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Mother and wife of #KulbhushanJadhav leave from residence of EAM Sushma Swaraj in Delhi pic.twitter.com/FFWIb4HcvJ
— ANI (@ANI) December 26, 2017
పాకిస్థాన్ లో మరణశిక్ష విధించబడ్డ భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్.. తల్లి, భార్యను కలుసుకోవచ్చని ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే సోమావారం ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తల్లి, భార్యను కలవడానికి ఒక సమావేశం ఏర్పాటుచేసింది. అయితే వారిమధ్య గాజు ను గోడగా (గ్లాస్ బారియర్) అడ్డుపెట్టి మాట్లాడనిచ్చింది పాక్.
Strong sense of anguish in India over the way #KulbhushanJadhav's meeting with his wife and mother took place in Pakistan yesterday. pic.twitter.com/vC8U2IgEQn
— All India Radio News (@airnewsalerts) December 26, 2017
గత సంవత్సరం మార్చిలో జాదవ్ ను గూడాచారి ఆరోపణలపై పాకిస్తాన్ సైన్యం అరెస్టు చేసిన తరువాత, అతని కుటుంబ సభ్యులతో మొదటి సమావేశం జరిగింది. తల్లి అవంతీ, భార్య చేతంకుల్ జాదవ్ వెంట భారతీయ డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్, ముగ్గురు భారతీయ విదేశాంగ శాఖ అధికారులు ఉన్నారు. జాదవ్ ఉన్న గదిలోకి వెళ్లడానికి జాదవ్ కుటుంబానికి మాత్రమే అనుమతి లభించింది. సింగ్ మరియు ఇతర అధికారులు గది బయటి నుండి సమావేశాన్ని పర్యవేక్షించారు. సమావేశం 40 నిమిషాలు కొనసాగింది.