Tamil nadu: తమిళనాట రాజకీయాలు ఇక మారనున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ విడుదల ఖాయమైంది. జైలు నుంచి బయటకు రాగానే..తమిళనాట రాజకీయాలు ఊపందుకోనున్నాయని తెలుస్తోంది.
తమిళనాడు ( Tamil nadu ) లో అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామంపై క్లారిటీ వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత ( Jayalalitha ) నెచ్చెలిగా చిన్నమ్మగా ప్రాచుర్యం పొందిన శశికళ ( Sasikala ) విడుదల ఖాయమైంది. ఈ నెల 27 వ తేదీన బెంగుళూరు జైలు ( Bengaluru Jail ) నుంచి విడుదల కానున్నట్టు ఆమె తరపు న్యాయవాది రాజా సేథురాపాండియన్ వెల్లడించారు.
2016లో జయలలిత మరణించిన అనంతరం అన్నాడీఎంకే ( AIADMK ) అధినేత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. కానీ అక్రమార్కుల కేసులో శిక్ష పొంది నాలుగేళ్లుగా బెంగళూరు జైళ్లో ఉన్నారు. జైలు శిక్ష పూర్తి కావడంతో పది కోట్ల జరిమానాను చెల్లించేస్తే ఆమె విడుదల ఖాయమవుతుంది. ఇప్పటికే జరిమానా డబ్బును చెల్లించేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది.
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ( Tamil nadu Assembly Elections ) జరగనున్నాయి. ఈ నేపధ్యంలో శశికళ జైలు నుంచి విడుదలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలిత హయాంలో శక్తివంతమైన మహిళగా ఉన్న శశికళ విడుదలవుతుండటం ప్రస్తుత అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అన్నాడీఎంకేలో శశికళను చేర్చుకోమని..ముఖ్యమంత్రి పళనిస్వామి ( Tamil nadu cm Palaniswamy ) ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో శశికళ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
Also read: New traffic rules: ఆ సినిమాలో ఉన్నట్టే..ఉల్లంఘిస్తే జేబు గుల్లవుతుంది మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Tamil nadu: ఖరారైన శశికళ విడుదల తేదీ, తమిళ రాజకీయాల్లో రాజుకోనున్న వేడి