Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసు.. మరోసారి ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ జాక్వెలిన్

Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట బుధవారం ఉదయం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరయ్యింది. వ్యాపారవేత్త సుకేష్ చంద్రశేఖర్ సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 01:55 PM IST
    • మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరైన నటి జాక్వెలిన్
    • జాక్వెలిన్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్న ఈడీ అధికారులు
    • సుకేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధంపై ఆరా
Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసు.. మరోసారి ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ జాక్వెలిన్

Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. బుధవారం ఉదయం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ)​ ఎదుట హాజరైంది. వ్యాపారవేత్త సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించి రూ. 200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో నేడు (డిసెంబరు 8) హాజరుకావాలని ఆమెకు ఈ సోమవారమే సమన్లు జారీ చేసింది ఈడీ.

మనీలాండరింగ్ కేసు విచారణలో హాజరయ్యేందుకు బుధవారం ఉదయం ఆమె ఢిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంది. అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. 

ఎయిర్ పోర్ట్ లో అడ్డుకొని..

అంతకు ముందు.. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఈ నెల 5న దుబాయికి వెళ్లాలని ముంబయి విమానాశ్రయానికి వెళ్లింది. ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమెను అడ్డుకొని.. ఈడీ లుక్ అవుట్ నోటీసులు ఉండడం వల్ల ఆమెను విదేశాలకు వెళ్లకుండా ముంబయి ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు.

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం (ఈఓడబ్ల్యూ) వారిని అరెస్ట్​ చేసింది. కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.

రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. సుకేష్ చంద్రశేఖర్ కు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సంబంధం ఉందన్న నేపథ్యంలో విచారణ కోసం ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు.  

Also Read: Jacqueline Fernandez: రేపు ఈడి ఎదుట విచారణకు జాక్వెలిన్ పెర్నాండెజ్.. సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలపై ఈడి ఆరా

Also Read: Extra Jabardasth Latest Promo: ‘జబర్దస్త్’ నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ అవుట్.. స్టేజ్ పైనే కన్నీటి వీడ్కోలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News