Isha Ambani and her Husband Anand Piramal blessed with twins: భారతదేశానికి చెందిన వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ మరోమారు తాతయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇషా అంబానీ ఆమె భర్త ఆనంద్ పెర్మల్ తల్లిదండ్రులయ్యారని వారిద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులైనట్లుగా ముఖేష్ అంబానీ టీం నుంచి ఒక ప్రకటన వెలువడింది.
ఈ ప్రకటనను అంబానీ పిరమిల్ కుటుంబాలు కలిసి సంయుక్తంగా విడుదల చేశాయి. కవల పిల్లలలో ఒక బాబు, ఒక పాప జన్మించారని జన్మించిన రోజే వారికి పేర్లు కూడా నమోదు చేశారని తెలుస్తోంది. పాపకు ఆదియా అనే పేరు నమోదు చేయగా బాబుకు కృష్ణ అనే పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇషా అంబానీ అలాగే ఆమె ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నీతూ అంబానీల కుమార్తె ఇషా అంబానీ రాజస్థాన్ కు చెందిన వ్యాపారవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ ను 2018 డిసెంబర్ లో పెళ్లాడింది. పిరమల్ కుటుంబానికి వెళ్లినా ఇషా అంబానీ మాత్రం రిలయన్స్ గ్రూప్ కి సంబంధించిన కొన్ని వ్యాపారాలు మేనేజ్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఆమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరో పక్క ఆమె భర్త ఆనంద్ పిరమల్ పిరమల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ విభాగాన్ని మేనేజ్ చేస్తున్నారు. నిజానికి ముకేశ్ అంబానీ ఇప్పటికే తాతయ్యారు. 2020 డిసెంబర్లో ముఖేష్ అంబానీ మొదటి మనవడు పృద్వి అంబానీ జన్మించాడు. ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ఆయన భార్య శ్లోకా అంబానీల కుమారుడే ఈ పృథ్వి అంబానీ.
Also Read: Auto Rickshaw Blast: కదులుతున్న ఆటోలో మంటలు.. వెలుగులోకి షాకింగ్ విషయం
Also Read: Trending Video: చిన్న స్పెల్లింగ్ మిస్టేక్.. కుక్కలా మారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Mukesh Ambani: మరోసారి తాతైన ముకేష్ అంబానీ.. కవల పిల్లలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ!