Home loans interest rates: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచిన SBI.. హోమ్ లోన్స్ భారం పెరగనుందా ?

Home loans interest rates latest updates: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవాళ్లు త్వరపడాల్సిన సమయం వచ్చిందా ? లేదంటే వాళ్లు తీసుకునే హోమ్ లోన్స్‌పై వడ్డీ భారం మరింత పెరగనుందా అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు. దేశంలోని ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గింపు (Housing loan interest rates), పెంపుదల, ఇతర కీలక నిర్ణయాల విషయంలో ఎస్బీఐని అనుసరిస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2021, 05:14 PM IST
  • మార్చి 1 నుంచి మార్చి 31 వరకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ.
  • ఏప్రిల్ 1 నుంచి మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన SBI.
  • SBI home loans interest rates పెంచడానికి దేనికి సంకేతం ?
Home loans interest rates: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచిన SBI.. హోమ్ లోన్స్ భారం పెరగనుందా ?

Home loans interest rates latest updates: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవాళ్లు త్వరపడాల్సిన సమయం వచ్చిందా ? లేదంటే వాళ్లు తీసుకునే హోమ్ లోన్స్‌పై వడ్డీ భారం మరింత పెరగనుందా అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు. దేశంలోనే అత్యథిక సంఖ్యలో కస్టమర్స్ కలిగిన పెద్ద బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) పేరు ఉంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో వడ్డీ రేట్ల సవరణకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఆర్బీఐ తీసుకుంటుందనే సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులకు తమకు ఉండే పరిధిలో వడ్డీ రేట్లు తగ్గింపు, పెంపు (Housing loan interest rates), ఇతర కీలక నిర్ణయాల విషయంలో మాత్రం దేశంలోని ఇతర బ్యాంకులు అనధికారికంగా ఎస్బీఐని అనుసరిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ఎస్బీఐ (SBI) తీసుకునే నిర్ణయాలు ఇతర బ్యాంకుల నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తుంటాయన్నమాట.

ఇక వడ్డీ రేట్ల విషయానికొస్తే.. ఇటీవలే మార్చి 1న హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించిన ఎస్బీఐ, ఆ ఆఫర్‌ను పరిమిత కాలానికే పరిమితం చేస్తూ ఏప్రిల్ 1 నుంచి మరో 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెంచింది. దీంతో ఎస్బీఐ వడ్డీ రేటు మళ్లీ 6.70 నుంచి 6.95 కి పెరిగింది.

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఎస్బీఐ తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తూ అదే బాటలో నడిచే బ్యాంకులు కూడా త్వరలోనే తమ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే కానీ జరిగితే, చాలా బ్యాంకుల్లో గృహరుణాలపై వడ్డీ రేట్లు (Interest on home loans) పెరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. 

ఎస్బీఐ కేవలం హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచడమే కాదు.. మార్చి 31 వరకు రద్దు చేసిన ప్రాసెసింగ్ ఫీజును కూడా తిరిగి వసూలు చేయడం ప్రారంభించింది. ఇకపై హోమ్ లోన్ (Home loan) మొత్తంపై 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజును కూడా విధిగా వసూలు చేయనుంది. 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జీఎస్టీ (GST on processing fee) కలిపి కనిష్టంగా రూ.10,000 లేదా గరిష్టంగా రూ. 30,000 వరకు ఎస్బీఐ చార్జ్ చేయనుంది.

ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను (Home loans interest rates) సమీక్షించి అప్పటి ఆర్థిక పరిస్థితి ప్రకారం వడ్డీ రేట్లు తగ్గించడమా లేక పెంచడమా చేసే ఎస్బీఐని (SBI) మిగతా బ్యాంకులు కూడా అనుసరిస్తున్న నేపథ్యంలో మిగతా బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలోనే వెళ్లే అవకాశం ఉందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

Also read : COVID-19 facts: కరోనా సోకిన వారిలో 78% మంది overweight లేదా obesity పేషెంట్సే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News