8Th Pay Commission: 2025లో 8వ పే కమిషన్ అమలు ఎప్పుడు? జీతాలు ఎంత పెరుగుతాయ్‌.. పూర్తి వివరాలు!

8Th Pay Commission Salary Hike Updates: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ అందబోతోంది. 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 
 

8Th Pay Commission Salary Hike Updates: 7వ వేతన సంఘం ఏర్పాటైన దశాబ్దం తర్వాత 8వ వేతన పంఘనం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల నుంచి డిమాండ్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వేతన సంఘానికి సంబంధించిన చర్చలను కూడా ఆర్థిక నిపుణులతో జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఈ 2025 కొత్త సంవత్సరం సందర్భంగా త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 8వ పే కమిషన్ 2025 సంవత్సరంలో అమల్లోకి వస్తే.. 2026 నుంచి పెరిగిన కొత్త జీతాలు పంపిణీ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.
 

1 /8

2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ఉహించని స్థాయిలో డిమాండ్స్‌ వస్తున్నాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని సమాచారం.

2 /8

ఇప్పటికే ఈ 8వ వేతన సంఘానికి సంబంధించిన అంశాలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు చర్చించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే వీటిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ వార్తలు నిరాధారమని.. దీనిపై ఆర్థిక శాఖ ఎలాంటి ప్రకట చేయాలేదని వెల్లడించింది.   

3 /8

వార్తలన్నీ నిరాధారమైనప్పటికీ గతంలో రాజ్యసభలో జరిగిన చర్చలు ఉద్యోగులకు సానుకులంగానే కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తే ఈ సంవత్సరంలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

4 /8

రాజ్య సభలో జరిగిన కొన్ని చర్చలను ఆధారంగా చూస్తే త్వరలోనే ఈ 8వ వేతన సంఘాన్ని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ దీనిని ప్రకటిస్తే..  చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.   

5 /8

అధికారిక సమాచారం ప్రకారం, త్వరలోనే ప్రకటించబోయే యూనియన్ బడ్జెట్‌ 2025- 2026లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ 8వ వేతన సంఘాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  అంతేకాకుండా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు దీనిపై  కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం కూడా అందించినట్లు తెలుస్తోంది..  

6 /8

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే.. వచ్చే ఏడాది 2026లో ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షన్స్‌ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు  186 శాతం వరకు జీతాల పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   

7 /8

ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే.. ఒక ఉద్యోగి సాధరణ బేసిక్‌ సాలరీ రూ.18,000 ఉంటే.. దాదాపు రూ.34,560 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెన్షన్‌ కూడా దాదాపు రూ.17,280 వరకు పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.   

8 /8

(నోట్‌: ఈ వార్త కేవలం ఇతర న్యూస్‌ వెబ్‌సైట్స్‌ నుంచి ఆప్డేట్‌గా మాత్రమే రాయబడింది. దీనిని జీ తెలుగు న్యూస్‌ దృవీకరించడం లేదు.)