SSMB 29 Pooja Ceremony: మహేష్ బాబు, రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో  వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.

1 /8

SSMB 29 Pooja Ceremony: మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీటైంది. దీంతో కొత్త యేడాదిలో మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.

2 /8

ఇక మహేష్ బాబుకు తను ఏదైనా సినిమా ఓపెనింగ్ కు వస్తే.. అది ఫెయిల్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. కానీ రాజమౌళితో చేస్తోన్న సినిమా కోసం స్వయంగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

3 /8

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు జుట్టు పెంచి పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

4 /8

రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు.  టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ బాబు నటన ప్రేక్షకులను ఫిదా చేయడం పక్కా అని చెబుతున్నారు.

5 /8

ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో కలిపితే .. దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం మహేష్ బాబు డేట్స్ కేటాయించాడు.  ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.

6 /8

ఈ చిత్రాన్ని రాజమౌళి డిఫరెంట్ హాలీవుడ్ లో అవతార్ వంటి సినిమాలకు వాడిన కెమెరాను యూజ్ చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో  పాటు స్రీన్ ప్లే, అన్ని భాషలకు సంబంధించి డైలాగ్స్ వెర్షన్స్ పూర్తయ్యాయి.

7 /8

ఈ చిత్రాన్ని అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కించబోతున్న ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.  ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు ఫారెన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ రాని  రానీ వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. 

8 /8

రాజమౌళి, మహేష్ బాబు  చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన దేవర ఫేమ్ జాన్వీ కపూర్ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.