''కరోనా వైరస్''ను ధీటుగా ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు (ఆదివారం) రోజున జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా పాటించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ జనతా కర్ఫ్యూను తప్పకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
జనతా కర్ఫ్యూ కారణంగా అంతా బంద్ వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా గుంపులుగా ఉండే ప్రాంతాలన్నీ రేపు ఉదయం నుంచి నిర్మానుష్యంగా కనిపించనున్నాయి. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, విమాశ్రయాలు ఇప్పటికే ఖాళీగా కనిపిస్తున్నాయి.
Read Also: ''కరోనా వైరస్''పై రైల్వే శాఖ నిర్లక్ష్యం
మరోవైపు దేశవ్యాప్తంగా జన కర్ఫ్యూను నిర్వహించనున్న వేళ .. రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల 700 రైళ్లను రద్దు చేసింది. దీంతో రేపు రైలు ప్రయాణం బంద్ కానుంది. దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు రద్దు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. రేపు( ఆదివారం) రాత్రి 10 గంటల వరకు రైళ్లన్నింటినీ రైల్వే శాఖ రద్దు చేసింది. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత యథావిధిగా రైళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Read Also: బాప్ రే బాప్..!!
నిజానికి రైల్వేశాఖ తొలుత మొత్తంగా 709 రైళ్లను రద్దుచేయాలని నిర్ణయించింది. అందులో 584 రైళ్లను పూర్తిగా, 125 రైళ్లను పాక్షికంగా రద్దు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత నిర్ణయాన్ని పునరుద్ధరించారు. ఏకంగా 3700 రైళ్లను రద్దు చేశారు. అందులో 2 వేల 400 ప్యాసింజర్ రైళ్లు ఉండగా 1300 రైళ్లు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉండడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..