Amaravati Capital: విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా పదేళ్లుగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ శుభవార్త. ఇప్పటికే శంకుస్థాపన పొందిన అమరావతి రాజధాని ప్రాంతం ఎప్పుడూ పూర్తవుతుందో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అమరావతి పూర్తికి ముహూర్తం నిర్ణయించింది. శరవేగంగా రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుని 2028లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read: Glass Symbol: పవన్ కల్యాణ్‌కు భారీ శుభవార్త.. జనసేనకు శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్
రాజధాని అమరావతి ప్రాంతంలో శుక్రవారం మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడు సమీపంలోనీ అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాల నిర్మాణాలు.. మౌలిక వసతుల కల్పనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. '2015 జనవరి ఒకటో తేదీన ల్యాండ్ పూలింగ్ ప్రకటన ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు' అని గుర్తుచేశారు.
'ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా అమరావతిని చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది' అని మంత్రి నారాయణ తెలిపారు. 'అసెంబ్లీనీ 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో పర్యాటక కేంద్రంగా చేయాలని డిజైన్ చేశాం. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. కోటీ 3 వేల చదరపు అడుగులతో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించాం' అని వెల్లడించారు.
'అంత గొప్పగా చేస్తే గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్లలో పెట్టేసింది' అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నారాయణ విమర్శలు చేశారు. 'నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేశాం. విద్యుత్ లైన్‌లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం మొత్తం అడవిగా మార్చేసింది' అని విమర్శించారు.
'రాజధానిని ముంచేసినందుకే ప్రజలు వైఎస్సార్‌సీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వై నాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయి' అని మంత్రి నారాయణ తెలిపారు. 'న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభ ఆలస్యమైంది. ఇప్పటివరకూ మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచాం' అని వివరించారు. 'జనవరి నెలాఖరులోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసింది. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం' అని మంత్రి నారాయణ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.