ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' విశేషాలు..

ప్రధాన మంత్రి నెలవారీ రేడియో ప్రసంగం 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం మాట్లాడారు.

Last Updated : Feb 25, 2018, 01:45 PM IST
ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' విశేషాలు..

ప్రధాన మంత్రి నెలవారీ రేడియో ప్రసంగం 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం మాట్లాడారు. ‘భారత దేశం ఎంతో మంది శాస్త్రవేత్తలకు నిలయం. భారత్ గొప్ప గణిత శాస్త్రజ్ఞులైనటువంటి బౌధాయణ, భాస్కర, బ్రహ్మగుప్త, ఆర్యభట్టలకు నిలయం. శుశృతుడు, చరకుడు వైద్య రంగంలో మనకు గర్వకారణం. సర్ జగదీష్ చంద్రబోస్, హరగోవింద్ ఖురానా, సత్యేంద్ర నాథ్ బోస్ వీరంతా గొప్ప శాస్త్రవేత్తలు' అంటూ భారత శాస్త్రరంగంలో వాళ్లు చేసిన సేవలను గుర్తు చేశారు.

టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)ను పేదలు, నిరుపేదల సంక్షేమానికి ఉపయోగించాలని ప్రధాని సూచించారు. ‘జాతీయ విపత్తులు మినహా మిగితావన్నీ మానవ తప్పిదాలే. మనం అప్రమత్తతో ఉండి,  నిబంధనలను పాటించడం ద్వారా వీటిని అరికట్టవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఏదైనా విపత్తు సంభవిస్తే.. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం అక్కడికి చేరుకునే వారే నిజమైన హీరోలని కొనియాడారు. 'మహిళల నేతృత్వంలోని అభివృద్ధి' శకానికి భారతదేశం నడుస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. సామాజిక, ఆర్థిక జీవితంలో మహిళలందరికీ సమాన భాగస్వామ్యం ఉందని చెప్పారు. దేశ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Trending News