దేశంలో తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 8,488 కరోనా కేసులు, 249 మరణాలు

Corona Cases In India Today: భారత దేశంలో కొత్తగా 8,488 మంది​కి కరోనా బారిన పడ్డారు. దీనితో దేశంలో కరోనా కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ ధాటికి మరో 249 మంది మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 11:50 AM IST
    • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
    • గడిచిన 24 గంటల్లో 8,488 కరోనా కేసులు, 249 మరణాలు
    • 538 రోజుల కనిష్ఠానికి చేరిన కొవిడ్ కేసుల సంఖ్య
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 8,488 కరోనా కేసులు, 249 మరణాలు

Corona Cases In India Today: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారి హెచ్చుతగ్గులు మినహా కరోనా కేసులు భారీగా తగ్గివచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,488 మంది​ వైరస్​ బారిన పడ్డారు. మరో 249 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒక్క రోజులో 12,510 మంది కరోనాను జయించారు. కొత్త కేసులు భారత్​లో​ 538 రోజుల కనిష్ఠానికి కొవిడ్ చేరుకోగా.. యాక్టివ్​ కేసులు 534 రోజుల కనిష్ఠానికి దిగొచ్చాయి.

కొవిడ్ పరీక్షలు..

భారత్​లో నవంబరు 21న 7,83,567 కొవిడ్​ టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 63,25,24,259కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,86,897 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 4,114 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,5,78,09,749కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,67,588కు పెరిగింది. 

Also Read: పెట్రోలింగ్ కు వెళ్లిన ఎస్సైను దారుణంగా నరికి చంపిన దొంగల ముఠా 

Also Read: రైతులకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్- స్మార్ట్​ఫోన్ కొంటే 10 శాతం క్యాష్​ బ్యాక్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News