Thanks to india: నాడు లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు సంజీవిని మూలిక కోసం పర్వతాన్ని మోసుకొచ్చారనేది రామాయణం చెబుతున్న మాట. అందుకే ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇండియాకు బ్రెజిల్ కృతజ్ఞతలు చెబుతోంది.
కరోనా వైరస్ ( Corona virus ) కట్టడిలో భారతదేశం పాత్ర కీలకంగా మారింది. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరాను మరోసారి ఇండియానే చేపట్టింది. ఇప్పుడు బ్రెజిల్ దేశానికి కరోనా వ్యాక్సిన్ ఇండియా నుంచి వస్తోంది. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ( Covishield ) ను ఇండియాలోని పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా బ్రెజిల్ దేశానికి 2 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతి చేశారు. గతంలో హైడ్రోక్సీ క్లోరోక్వీన్ మాత్రల్ని పంపించింది ఇండియా.
భారత్ అందించిన సహాయానికి బ్రెజిల్ ( Brazil ) కృతజ్ఞతలు తెలుపుతోంది. అది కూడా కాస్త వినూత్న తరహాలో. భారత దేశాన్ని హత్తకునేలా ఉంది ఆ విధానం. రామాయణ ( Ramayanam ) ఇతివృత్తాన్ని ఎంచుకుంది దీనికోసం. నాడు లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవిని పర్వతాన్ని ( Sanjivani mountain ) మోసుకొచ్చిన హనుమంతుడి ( Lord Hanuman ) ఫోటోను...షేర్ చేస్తూ భారత్‌కు దన్యవాదాలు తెలిపారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ( Brazil president Jair Bolsonaro ). ఈ ఫోటో ద్వారా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
- Namaskar, Primeiro Ministro @narendramodi
- O Brasil sente-se honrado em ter um grande parceiro para superar um obstáculo global. Obrigado por nos auxiliar com as exportações de vacinas da Índia para o Brasil.
- Dhanyavaad! धनयवाद pic.twitter.com/OalUTnB5p8
— Jair M. Bolsonaro (@jairbolsonaro) January 22, 2021
నమస్కార్..ప్రైమ్ మినిస్టర్ మోదీజీ..కోవిడ్‌పై పోరులో మేం చేస్తున్న పోరుకు మీరు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇది మాకు గర్వకారణం కూడా అని రాసి..ధన్యవాద్ భారత్ అంటూ షేర్ చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడి ట్వీట్‌కు ప్రధాని మోదీ ( Pm Modi ) స్పందించారు. కోరనా వైరస్‌పై మనం కలసికట్టుగా చేస్తున్న పోరాటానికి మా సహకారం ఎప్పటికీ ఉంటుందని..ఆరోగ్యరంగంలో ఉభయదేశాలు సహకరించుకోవల్సిందేనని గుర్తు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook