India Covid-19: 73 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదైన కేసులు.. రెండురోజుల నుంచి తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.

Last Updated : Oct 15, 2020, 10:21 AM IST
India Covid-19: 73 లక్షలు దాటిన కరోనా కేసులు

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70వేలకుపైగా నమోదైన కేసులు.. రెండురోజుల నుంచి తక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 87.36 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.52 శాతం, యాక్టివ్ కేసుల రేటు 11.12 శాతం ఉన్నట్లు వైద్యశాఖ గురువారం వెల్లడించింది. Also read: Hathras Case: బాధితురాలి కుటుంబసభ్యులకు మూడంచెల భద్రత: యూపీ ప్రభుత్వం

గత 24గంటల్లో బుధవారం ( అక్టోబరు 14న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 67,708 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 680  మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,07,098 కి చేరగా.. మరణాల సంఖ్య 1,11,266 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 63,83,441 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,12,390 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 11,36,183 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 14 వరకు మొత్తం 9,12,26,305 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.  Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ

Trending News