రికార్డు కరోనా కేసులు.. భారత్‌లో 4లక్షలు దాటిన కరోనా బాధితులు

కరోనా వైరస్(CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కేసులు ఇలాగే పెరిగిపోతుంటే భారత్ అగ్రస్థానానికి చేరి పరిస్థితి పూర్తిగా అదుపుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకనుంచైనా ప్రజలు తగిన జాగ్రత్తలు వహిస్తేనే కరోనా మహమ్మారిని నియంత్రించగవచ్చు.

Last Updated : Jun 21, 2020, 12:15 PM IST
రికార్డు కరోనా కేసులు.. భారత్‌లో 4లక్షలు దాటిన కరోనా బాధితులు

భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirusCases India) కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,516 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకూ ఒక్కరోజులో ఇంత భారీ కేసులు నమోదు కావడం నేడే అత్యధికం. అదే సమయంలో 306 మంది తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,254కు చేరింది.  ఆగస్టులో Niharika నిశ్చితార్థం, కాబోయే భర్తతో నిహారిక ఫొటోలు వైరల్

తాజా కేసులలో కలిపితే దేశంలో ఇప్పటివరకూ మొత్తం 4,10,461 కరోనా పాజిటివ్ కేసులు(India CoronaVirus Cases) నమోదయ్యాయి. కాగా, ఇందులో ప్రస్తుతం 1,69,451 మంది కరోనాకు చికిత్స పొందుతుండగా, మరో 2,27,755 మంది ప్రాణాంతక వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకూ 68,07,226 శాంపిల్స్‌ పరీక్షించారు. కాగా, గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,90,730 శాంపిల్స్ సేకరించి కోవిడ్ టెస్టులు నిర్వహించడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News