India Corona Update: దేశంలో కరోనా సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల తప్ప మిగిలిన ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)సృష్టించిన విలయం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు కూడా సద్దుమణుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
ఇక దేశంలో కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో 17 లక్షల 22 వేల 221 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..39 వేల 70 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 19 లక్షల 34 వేల 455కు చేరగా..గత 24 గంటల్లో 491 మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ అంటే కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 4 లక్షల 27 వేల 862 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
Also read: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత డబ్బులు రేపే విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook