EPFO Pension Latest News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై చర్చ జరుగుతుండగా.. మరో ఆందోళన తెరపైకి వచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) కింద కవర్ చేసే పెన్షనర్లకు నెలకు కనీస పెన్షన్ రూ.7,500 ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పెంచడంతోపాటు ఇతర డిమాండ్లపై బుధవారం నుంచి దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని 200 నగరాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఈపీఎస్-95 జాతీయ పోరాట కమిటీ (ఎన్ఏసీ) మంగళవారం వెల్లడించింది.
మార్చి 15 నుంచి దేశ రాజధానితో సహా 200 నగరాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పెన్షన్‌ను నెలకు 7,500 రూపాయలకు పెంచడంతోపాటు డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వడం, ఈపీఏఎస్-95 పెన్షనర్లకు ఎలాంటి వివక్ష లేకుండా అధిక పెన్షన్‌ను అందించడం.. వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం వంటివి డిమాండ్లపై నిరసనలు చేపట్టనున్నారు.
మొదటి ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పరిధిలోకి వచ్చిన పింఛన్‌దారుల ప్రతినిధి బృందం కూడా ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. జాతీయ పోరాట కమిటీ కన్వీనర్ అశోక్ రౌత్ మాట్లాడుతూ.. ఈపీఎస్-1995 లబ్ధిదారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గత ఏడేళ్లుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ఎంపీ హేమ మాలిని నేతృత్వంలో మేం రెండుసార్లు ప్రధానిని కలిశామన్నారు. ప్రధాని హామీ ఇచ్చారని.. ఆ విషయం ఇంకా పెండింగ్‌లో ఉందని చెప్పారు.
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని.. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్ నిధికి జమ చేసినా తమను అధోగతిలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే ఉద్యోగుల మూలవేతనంలో 12 శాతం, 95 భవిష్యనిధికి చేరడం గమనార్హం. యజమాని వాటాలో 12 శాతంలో, 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌కు వెళుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా 1.16 శాతం పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తుంది. ఉద్యోగం చేసిన కాలంలో పెన్షన్ ఫండ్‌లో డబ్బు జమ చేసిన తర్వాత.. ప్రస్తుతం సగటున రూ.1,171 పెన్షన్ మాత్రమే అందుతోంది. ఇది సరిపోదు. రూ.7,500 కరువు భత్యం లభిస్తే గౌరవంగా జీవించవచ్చు..' అని అశోక్ రౌత్ అన్నారు.
Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి
Also Read: Facebook Layoffs: మెటా సంచలన నిర్ణయం.. 10 వేల ఉద్యోగాలు తొలగింపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook