DU Recruitment 2024: ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగం కావాలా..అయితే వెంటనే అప్లయ్ చేసుకోండి..చివరి తేదీ ఎప్పుడంటే?

DU Recruitment 2024: టీచింగ్ ఫీల్డ్ అంటే ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీ అనేక పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను రిక్రూట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు, ఎంపిక విధానం, ఫీజు, చివరి తేదీ వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Dec 18, 2024, 11:35 AM IST
DU Recruitment 2024:  ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగం కావాలా..అయితే వెంటనే అప్లయ్ చేసుకోండి..చివరి తేదీ ఎప్పుడంటే?

DU Recruitment 2024: టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వారికి గుడ్ న్యూస్. ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిది.  దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 18 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ du.ac.inని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ తో సహా అనేక పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు డీయూ తెలిపింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 27 చివరి రోజుగా పేర్కొంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య , జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. 

ఖాళీల వివరాలు:

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 137 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 11 అసిస్టెంట్ రిజిస్ట్రార్, 46 సీనియర్ అసిస్టెంట్, 80 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు : 

జనరల్/అన్ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన వారికి దరఖాస్తు ఫీజు రూ. 1000. OBC (NCL), EWS మహిళా కేటగిరీ అభ్యర్థులకు రూ. 800/,  SC, ST,  PwBD కేటగిరీ అభ్యర్థులకు రూ.600/-. ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: Donald Trump: మా ఓట్లతో గెలిచి మాకే పంగనామం పెడతావా ట్రంప్.. ? భారత్‌కు ప్రెసిడెంట్‌ గారి వరుస షాకులు!  

దరఖాస్తు విధానం ఇలా: 

*ముందుగా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ du.ac.inకి వెళ్లండి.

*తర్వాత లేటెస్టు అప్ డేట్స్ కు  వెళ్లి, నాన్ టీచింగ్ పోస్ట్ లింక్‌ కనిపిస్తుంది. 

*ఇప్పుడు ఆ లింక్ పై క్లిక్ చేయండి. 

* ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆన్ లైన్ అప్లికేషన్ లింకపై క్లిక్ చేయడి. 

*ఇప్పుడు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 

*ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకునేందుకు అకౌంట్ కు లాగిన్ అవ్వండి. 

*ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు చెల్లించాలి. 

* ఆపై సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.

* చివరగా, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.

Also Read: Stock Market: యూఎస్ ఫెడ్ నిర్ణయానికి ముందు  నష్టాల్లో  ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు   

అర్హతలు: 

అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 55 శాతం ఉత్తీర్ణత మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణ సాధించి ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీతోపాటు 3 సంవత్సరాల అసిస్టెంట్ పోస్ట్ అనుభవం ఉండాలి. అసిస్టెంట్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీతోపాటు జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన పోస్టులో అనుభవం ఉండాలి. ఇవే కాకుండా  హిందీ, ఇంగ్లీషులో టైపింగ్ చేయడం కూడా రావాలి. మరింత సమాచారం కోసం ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్లో కి వెళ్లి తెలుసుకోండి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News