Driving license New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై టెస్ట్ డ్రైవ్ అవసరం లేదా, కొత్త నియమాలు ఎలా ఉన్నాయి

Driving license New Rules: డ్రైవింగ్ లైసెన్స్  విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ కావాలంటే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అవసరమా..లేదా..కేంద్రం కొత్త నియమాలు ఏమంటున్నాయి. ఇక నుంచి లైసెన్స్ తీసుకోవడం సులభమా..కఠినమా..

Last Updated : Feb 7, 2021, 08:34 PM IST
Driving license New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై టెస్ట్ డ్రైవ్ అవసరం లేదా, కొత్త నియమాలు ఎలా ఉన్నాయి

Driving license New Rules: డ్రైవింగ్ లైసెన్స్  విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ కావాలంటే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అవసరమా..లేదా..కేంద్రం కొత్త నియమాలు ఏమంటున్నాయి. ఇక నుంచి లైసెన్స్ తీసుకోవడం సులభమా..కఠినమా..

డ్రైవింగ్ లైసెన్స్ ( Driving license ) కావాలంటే అదొక ప్రహసనమే ప్రస్తుతం. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ ( Learning license ) తీసుకోవాలి. నెల రోజుల తరువాత..ఆరు నెలల్లోగా శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంచుకున్న సమయం ప్రకారం ఆర్టీఏ  ( RTA ) కార్యాలయానికి వెళ్లి..టెస్ట్ డ్రైవ్ ( Driving Test ) చేయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో ఫెయిలైతే మరోసారి దరఖాస్తు చేసుకోక తప్పదు. ఇలా ఇదొక సుదీర్ఘమైన ప్రహసనమే. ఏజెంట్ వ్యవస్థ ఉన్నచోట..డబ్బులు సమర్పిస్తే ఇవేమీ ఉండవనేది వేరే విషయమనుకోండి. నిబంధనలైతే ఇవే మరి. 

ఇప్పుడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government )కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా. నిజమే. కేంద్రం ఇలాగే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కొత్త నిబంధనల  ( Driving license new rules ) ప్రకారం డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు గుర్తింపు కూడా ఇవ్వనుంది. ప్రభుత్వంతో గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేస్తే..ఆర్టీఏ నుంచి లైసెన్స్ పొందవచ్చు. అదే సమయంలో శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉండదు. అనుమతులు, శిక్షణా కార్యక్రామల పర్యవేక్షణ వంటి వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రభుత్వమే కొన్ని డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్ని గుర్తిస్తుంది. కొన్ని నియమ నిబంధనల్నీ జారీ చేస్తుంది. వాటి ప్రకారమే డ్రైవింగ్ కేంద్రాలు నడవాల్సి ఉంటుంది. 

Also read: Flash floods: ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదపై స్పందించిన ప్రధాని మోదీ, కొనసాగుతున్న సహాయక చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News