దారుణం.. గాయానికి కుట్టు వేయకుండా ఫెవిక్విక్‌ అతికించిన వైద్యులు

భగవంతుడికి మరో రూపం ఎవరు అంటే.. డాక్టర్స్ అనే చెప్తారు. సమాజంలో అంతటి పేరున్న డాక్టర్ లకు కొంత మంది వైద్యుల వల్ల మిగతా వారి పేరు కు పోతుంది. వైద్యం కోసం వెళ్లిన బాలుడికి కుట్లకు బదులుగా ఫెవిక్విక్ పెట్టిన వినం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 07:01 PM IST
దారుణం.. గాయానికి కుట్టు వేయకుండా ఫెవిక్విక్‌ అతికించిన వైద్యులు

ప్రమాదంలో గాయపడి.. లేదంటే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్తే అక్కడి వైద్యులు చేసే హడావుడికి, వారు చేసే ట్రీట్మెంట్ కి కొన్ని సార్లు పేషెంట్స్ మరియు వారితో వెళ్లిన వారు షాక్ అవుతూ ఉంటారు. ఇటీవల ఒక చిన్నారికి ఆడుకుంటూ ఉండగా కింద పడి తలకు గాయం అవ్వడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. 

ఆ గాయానికి కుట్లు వేయకుండా అంటుకోవడం కోసం ఫెవిక్విక్ వేయడం మాత్రమే కాకుండా, ఏం కాదు.. ఏమైనా జరిగితే మేము చూసుకుంటాం అంటూ వైద్యుడు చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటన వైద్య చరిత్రలోనే కలంకంగా మారింది అంటూ కొందరు వైద్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు ఇటీవల తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కి ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో వంశీకృష్ణ, సునీత దంపతుల ఏడు సంవత్సరాల కుమారుడు ప్రవీణ్ చౌదరి ఆడుకుంటూ ఉండగా కింద పడ్డాడు. దాంతో అతడి కంటి పై భాగంలో లోతైన గాయం ఏర్పడింది. 

తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయం లోతుగా ఉండడంతో కుట్లు వేయాల్సి ఉంటుందని తల్లిదండ్రులు భావించారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం గాయం మూసివేయడానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అంటించారు. ఆపై ప్లాస్టర్ వేశారు. విషయాన్ని గుర్తించిన వంశీకృష్ణ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ తమ సిబ్బంది తెలియక పొరపాటు చేసి ఉంటారని, పిల్లాడికి ఏమైనా జరిగితే తాను బాధ్యత వహిస్తానని వంశీ కృష్ణకి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. 

Also Read: Drugs Supplying to Students: విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ సరఫరా.. ముఠా అరెస్ట్

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. బాలుడికి ఫెవిక్విక్ అంటించినట్లు ఆసుపత్రికి సిబ్బంది అంగీకరించారు. దాంతో పోలీసులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు సదరు ఆసుపత్రి పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 

బాధ్యతరాహిత్యంతో వ్యవహరించిన హాస్పిటల్ యొక్క లైసెన్స్ రద్దు చేయాల్సిందే అంటూ స్థానికులు మరియు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బందిని.. ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ అంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి.

Also Read: Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News