Supreme Court on Arvind Kejriwal Bail: దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇవాళ లేదా రేపు మద్యంతర బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో తీర్పు రిజర్వ్ చేసేముందు సుప్రీంకోర్టు షరతులు వర్తిస్తాయని తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ మద్యంతర బెయిల్‌పై ఇవాళ లేదా రేపు తీర్పు వెలువడనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ జరిపింది. అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వీ వాదించగా ఈడీ తరపున తుషార్ మెహతా, ఎస్ వి రాజులు వాదనలు విన్పించారు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులను ప్రత్యేకంగా పరిగణించినట్టవుతుందని అభ్యంతరం తెలిపారు. మద్యంతర బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు.
అయితే ఈ వాదనల్ని కోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మాత్రమే కాదని ఓ పార్టీ అధినేతగా ప్రచారం చేసే హక్కు ఉందని తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ తరచూ నేరాలు చేసే వ్యక్తి కూడా కాదని, ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు ప్రచారం చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే ఒకవేళ బెయిల్ మంజూరు చేసినా షరతులు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరైనా సరే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహించకూడదని తెలిపింది. అటు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై బయటికొచ్చినా ఎలాంటి ఫైళ్లు, కాగితాలపై సంతకాలు చేయరని వివరించారు.
ఈ కేసుపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. బెయిల్‌పై తీర్పును ఇవాళ లేదా రేపు వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై కూడా విచారణ జరిపిన సుప్రీంకోర్టు దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అవడానికి ముందున్న కేసు ఫైళ్లను కోర్టు ఆదేశాలతో ఈడీ సమర్పించింది.
Also read: Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook