Arvind Kejriwal: పంజాబ్‌లో పాగా వేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు, ఉచిత్ విద్యుత్ ప్రకటన

Delhi CM Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అంటూ ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2021, 04:38 PM IST
Arvind Kejriwal: పంజాబ్‌లో పాగా వేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు, ఉచిత్ విద్యుత్ ప్రకటన

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ తరహాలోనే మరో రాష్ట్రంలో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భావిస్తోంది. ఉచిత విద్యుత్ అంటూ ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 

గతంలో ఢిల్లీలోనూ కరెంట్ కొరత, కరెంట్ బిల్లుల సమస్య ఉండేదని, ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి చక్కదిద్దామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) పేర్కొన్నారు. కరెంట్ సమస్య, విద్యుత్ బిల్లులతో మహిళలు, ప్రతి కుటుంబం ఇబ్బంది పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ చంఢీగఢ్ పర్యటనకు ముందురోజు ఆప్ నేతలు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత అందిస్తామని, 200 యూనిట్ల వరకు ఢిల్లీ తరహాలోనే ఫ్రీ కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ప్రకటన అధికార కాంగ్రెస్‌కు మరియు ప్రధాన ప్రతిపక్షాలైన ఎస్‌ఏడీ మరియు బీజేపీలకు పెను సవాల్‌గా మారనుంది.

Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, వివరాలివే

పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందించి మహిళల ముఖాల్లో సంతోషాన్ని నింపుతామని చండీగఢ్ పర్యటనకు ముందు రోజు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున సీఎం అభ్యర్థి జాట్ సిక్కు అని కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారు. తాజాగా ఉచిత విద్యుత్ అంశంపై హామీ ఇచ్చి అక్కడి ప్రధాన పార్టీలలో చిచ్చు రాజేశారు. ఇదే హామీతో ఢిల్లీలో భారీగా ఓటు బ్యాంకును సాధించి అధిక స్థానాలు కొల్లగొట్టడం తెలిసిందే.

Also Read: Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు, ఎప్పుడంటే

పంజాబ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్ ఒప్పందాలతో ప్రజలపై పెనుభారం పడుతుందని, ప్రైవేట్ కంపెనీలు మాత్రం లాభపడ్డాయని కేజ్రీవాల్ విమర్శించారు. కనుక తమకు మద్దతు తెలిపి ఉచిత విద్యుత్ పొందాలని పంజాబ్(Punjab) ప్రజలకు ఆప్ కన్వీనర్ పిలుపునిచ్చారు. శిరోమణి అకాలీదళ్ మరియు బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజలు చేసిందేమీ లేదన్నారు. విద్యుత్ బిల్లులు నియంత్రించలేదని, ప్రజలపై పెనుభారం మోపుతూ ప్రైవేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చారని విమర్శించారు. ఈ విషయంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పంజాబ్ ఆప్ చీఫ్ భగవంత్ మన్ ఆరోపించారు.

Also Read: India Corona Cases Today: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 102 రోజుల తరువాత తొలిసారి

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 20 స్థానాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు నెగ్గగా, దాని మిత్రపక్షం బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కావడం తెలిసిందే. ఈసారి ఎలాగైనా పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News