Tihar Jail: మళ్లీ జైలుకెళ్లిన అరవింద్‌ కేజ్రీవాల్‌.. మరింత ఉచ్చు బిగియనుందా?

Arvind Kejriwal Back To Tihar Jail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ తిహార్‌ జైలులోకి చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 2, 2024, 09:29 PM IST
Tihar Jail: మళ్లీ జైలుకెళ్లిన అరవింద్‌ కేజ్రీవాల్‌.. మరింత ఉచ్చు బిగియనుందా?

Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ జైలుకు వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన ఆయన తన బెయిల్‌ గడువు ముగియడంతో తిహార్‌ జైలులో సరెండర్‌ అయ్యారు. 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను కోర్టు పొడిగించేందుకు నిరాకరించడంతో ఆయన విధిలేక మళ్లీ కారాగారానికి చేరుకున్నారు.

Also Read: Election Results 2024: అరుణాచల్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం పార్టీ క్లీన్‌స్వీప్‌.. కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటు

 

జైలుకు తిరిగి వెళ్తున్న సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం తన నివాసంలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. అనంతరం భార్య సునీత కేజ్రీవాల్‌, పార్టీ నాయకులతో కలిసి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి హనుమాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: PM Modi Hotel Bill: సద్దుమణిగిన ప్రధాని మోదీ హోటల్‌ అద్దె గొడవ.. రూ.80 లక్షలు చెల్లించేదెవరో తెలుసా?

 

'మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. 21 రోజుల్లో ఒక్క నిమిషం వృథా చేయలేదు. ఇండియా కూటమి తరఫున ప్రచారం నిర్వహించా. దేశ ప్రయోజనాలకే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత ఆమ్‌ ఆద్మ్‌ పార్టీ' అని అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శించారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తిహార్‌ జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ మంజూరుచేసింది. దీంతో మే 10వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. ఢిల్లీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఆమ్‌ ఆద్మ్‌ పార్టీతోపాటు ఇండియా కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 21 రోజుల మధ్యంతర బెయిల్‌ గడువు జూన్‌ 2వ తేదీతో ముగియడంతో తిహార్‌ జైలుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేజ్రీవాల్‌ చేరుకున్నారు. అతడి జ్యూడిషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్‌ 5వ తేదీ వరకు పొడిగించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News