Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త, DA రెట్టింపు చేసిన సర్కార్

Written by - Shankar Dukanam | Last Updated : May 25, 2021, 11:41 AM IST
  • కేంద్ర సంబంధింత శాఖలలో పనిచేసే కార్మికులకు శుభవార్త
  • వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ రెట్టింపు చేసిన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ
  • గనులు, చమురు క్షేత్రాలు, రైల్వే కార్మికులకు వీడీఏ సవరణ
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త, DA రెట్టింపు చేసిన సర్కార్

కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వ కార్మికులకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.105 ఉన్న డీఏను రెట్టింపు చేసి రూ.210కి పెంచారు. ఏప్రిల్ 1, 2021 నుంచి పెంచిన వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ అమలులోకి రానుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికులకు కనిష్ట వేతనాన్ని పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రంగాల వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహించే కార్మికులు, ఉద్యోగులకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (Variable Dearness Allowance) పెంచుతూ వారికి స్వల్ప ఊరట కలిగించారు. ఏప్రిల్ 1, 2021నుంచి వీడీఏ అమలులోకి రానున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పారిశ్రామిక కార్మికులు, వినియోగదారులు సగటు ధరల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వలో పలు శాఖలలో పనిచేస్తున్న కార్మికులకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్‌ను కార్మిక శాఖ సవరించింది.

Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి

తాజా వీడీఏ సవరింపులో భాగంగా 2020 జూలై నుంచి డిసెంబర్ నెలల మధ్య కాలంలో వినియోగదారులు సగటు ధరల సూచీని ప్రామాణికంగా తీసుకున్నారు.  తాము తీసుకున్న తాజాగా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలలో పనిచేస్తున్న 1.50 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధిశాఖల మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. కరోనా కష్టకాలంలో వీడీఏ సవరణ, మరియు పెంపు నిర్ణయం కార్మికులు(Central Govt Employees) దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.  

ఈ తాజా నిర్ణయం కచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చి తీరుతుందన్నారు. రైల్వేశాఖ, గనులు, చమురు క్షేత్రాలు మరియు ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహించే కార్మికులకు సవరించిన వీడీఏ అందుతుంది. కాంట్రాక్టు, ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్న అందుకు కార్మికులకు వీడీఏలో ఎలాంటి వ్యత్యాసం ఉండదని స్పష్టం చేశారు. 

Also Read: Gold Price Today In Hyderabad: వరుసగా ఐదోరోజు స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పుంజుకున్న వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News