Covid 19 vaccination for 12-14 childrens to starts from March 16: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై విజయం సాధించడానికి అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గతేడాది జనవరి 16వ తేదీన భారత దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఏజ్ గ్రూప్‌ను బట్టి టీకాలు ఇస్తూ వస్తోంది ప్రభుత్వం. మొన్నటివరకు 15 ఏళ్ల వరకు టీకాలు ఇచ్చిన కేంద్రం.. తాజాగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కూడా ఇచ్చేందుకు గ్రీన్ ఇచ్చింది. 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారికి టీకా కార్యక్రమాన్ని మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
దేశంలో 12 నుంచి 14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ ప్రతిపాదనను అంగీకరించిన కేంద్రం బుధవారం నుంచి టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బయోలాజికల్ ఇ సంస్థ నుంచి వస్తున్న కార్బెవాక్స్ టీకాను పిల్లలకు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించగా.. దాదాపు పూర్తయిన నేపథ్యంలో 12-14 ఏళ్ల వారిపై కేంద్రం దృష్టి పెట్టింది.
12 నుంచి 14 ఏళ్ల వారికి టీకా పంపిణీతో పాటు 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రికాషన్ డోసులో ఇతర అనారోగ్య సమస్యల క్లాజ్‌ను తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మార్చి 16వ తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నారు. 2022 జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి కేంద్రం ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు భారత దేశవ్యాప్తంగా 180.19కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది . 15 నుంచి 18 వయసు వారిలో 5.58కోట్ల మంది తొలి డోసు తీసుకోగా.. 3.38కోట్ల మందికి రెండు డోసులు కూడా తీసుకున్నారు. ఇక 60 ఏళ్లు పైబడిన వారిలో 1.03 కోట్ల మంది ప్రికాషనరీ డోసు తీసుకున్నారు.
Also Read: ODI World Cup 2022: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఔట్!!
Also Read: Radhe Shyam OTT Release: ఓటీటీకి ప్రభాస్ 'రాధేశ్యామ్'... స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook