కరోనా మహమ్మారి(CoronaVirus) ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. దీనిలో భాగంగా 2020లో భారత ఆర్థిక వ్యవస్థ భారీగా పతనం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఈ ఏడాది అన్ని ప్రాంతాల వృద్ధి రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం మాత్రం ఇదే మొదటిసారి. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి (coronavirus) లాక్డౌన్ కారణంగా అన్ని దేశాలు ఆర్థిక సవాళ్లతో అతలాకుతలం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత (INDIA) ఆర్థిక వ్యవస్థ 4.5శాతం క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund)అంచనా వేసింది. ఇది చారిత్రాత్మక క్షీణత అని ఐఎంఎఫ్ (IMF)బుధవారం తెలిపింది. దీర్ఘకాలిక లాక్డౌన్, కరోనా నివారణ చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని పేర్కొంది. 2021లో దేశం మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటుందని, వచ్చే ఏడాది 6.0 శాతం వృద్ధిని చూడవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థిక నిపుణులు ఇండో అమెరికన్ గీతా గోపినాథ్ (IMF Chief Economist Gita Gopinath) పీటీఐతో మాట్లాడుతూ.. ఈ సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ 4.5శాతానికి తగ్గుతుందని అంచనా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. దాదాపు అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
4.9 శాతానికే పరిమితం కానున్న ప్రపంచ వృద్ధి రేటు..
2020లో ప్రపంచ వృద్ధి రేటు (World GDP growth) 4.9 శాతం తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే అన్ని దేశాల వృద్ధి తగ్గుతుందని అంచనా వేయడం ఇదే మొదటిసారి. 2020 ఏప్రిల్ లో విడుదలైన అంచనా నుంచి ఇది 1.9 శాతం మేర తగ్గింది. ఇదిలాఉంటే... మొదటి త్రైమాసికంలో గణనీయమైన క్షీణత తరువాత మళ్లీ పుంజుకుంటున్న చైనా(china)లో వృద్ధి రేటు 1.0 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ