CAB protest in Delhi | పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమన్న నిరసనలు.. మూడు బస్సులకి నిప్పు.. స్పందించిన సీఎం

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలోని జామియా నగర్‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టిన నిరసనకారులు.. మూడు బస్సులకి నిప్పుపెట్టారు.

Last Updated : Dec 15, 2019, 09:04 PM IST
CAB protest in Delhi | పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమన్న నిరసనలు.. మూడు బస్సులకి నిప్పు.. స్పందించిన సీఎం

న్యూ ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలోని జామియా నగర్‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టిన నిరసనకారులు.. మూడు బస్సులకి నిప్పుపెట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బందితోనూ ఆందోళనకారులు ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఇద్దరు సిబ్బందికి గాయలు కూడా అయ్యాయి. ఈ ఆందోళనల కారణంగా ఢిల్లీ మెట్రో రైల్వే అధికారులు సుఖ్‌దేవ్ విహార్ మెట్రో స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు మూసేయాల్సి వచ్చింది. ఆశ్రం మెట్రో స్టేషన్‌లోనూ అధికారులు 3వ నెంబర్ గేట్‌ను మూసి ఆందోళనకారులు మెట్రో స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. జామియా నగర్‌లో జరిగిన ఈ దాడిలో కానీ లేదా ఆందోళనల్లో కానీ తాము పాల్పంచుకోలేదని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి సంఘాల నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. Read also : రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఇదిలావుంటే, ఈ దాడి అనంతరం ట్విటర్ ద్వారా స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆందోళనకారులు శాంతియుతంగా తమ నిరసన తెలియచేయాలని సూచించారు. విధ్వంసకరమైన ఆందోళనలు చేపట్టవద్దని.. ఆందోళనల్లో విధ్వంసం ఏ రూపంలో ఉన్నా.. దానిని అంగీకరించబోమని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. Read also : బీజేపీయేతర ముఖ్యమంత్రులు స్పందించాల్సిన సమయం ఇది: ప్రశాంత్ కిషోర్

Trending News