ఇటీవల చైనాలో మొదలై దాదాపు 50 దేశాలను వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్ ఇప్పటికే వేలాది ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను పలు దేశాలు తాత్కాలికంగా నిషేధించాయి. ఈ క్రమంలో వెల్లుల్లి భారతీయుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనా నుంచి వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాక దాదాపు ఐదేళ్ల కిందటే చైనా నుంచి వెల్లుల్లి దిగుమతిని నిషేధించింది.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చైనా వెల్లుల్లి గుర్తించారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వెల్లుల్లి పైనుంచి చూస్తే చాలా తెల్లగా ఉంటుంది. కానీ లోపల విత్తనాలు గులాబీ లేక కొద్దిగా నల్ల రంగులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా చైనాలో రెండు వేలకు పైగా చనిపోగా, అది ప్రపంచ దేశాలకు విస్తరించి ప్రాణభయం పట్టుకుంది. చైనా వెల్లుల్లి మన దేశంలో కనిపించడంతో ప్రజల్లో భయం పట్టుకుంది. చైనా వెల్లుల్లిని క్లోరిన్‌తో బ్లీచింగ్ చేస్తారు. దాంతో అది పైనుంచి పూర్తి తెల్లగా కనిపిస్తుంది. ఇందులో పురుగుమందులు, రసాయనాలు వాడతారని గమనించాలి.
See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా?
చైనా నుంచి దిగుమతయ్యే వెల్లుల్లి ఆరోగ్యానికి హానికరం, విషపూరితమైనదని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈ వెల్లుల్లి తింటే ఆనారోగ్యం తలెత్తుతుంది. దీనిపై పశ్చిమ బెంగాల్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కమల్ దే స్పందించారు. చైనా వెల్లుల్లి ప్రమాదకరమని తెలిసినప్పటి నుంచీ ఆ ఉత్పత్తులపై దిగుమతి నిషేధించారు. తరచుగా టాస్క్ ఫోర్స్, ఇతర అధికారులు తనిఖీలు చేపట్టి ప్రజలను ఆ హానికర వెల్లుల్లి నుంచి కాపాడుతున్నాం. మీడియా ద్వారా ఈ ప్రమాదకర చైనా వెల్లుల్లి గురించి ప్రజల్ని హెచ్చరిస్తున్నారని చెప్పారు.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా ఉంటుందని జాదవ్‌పూర్ యూనివర్శిటీ ఫుడ్ టెక్నాలజీ, బయో కెమికల్ విభాగం ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ విశ్వాస్ తెలిపారు. అల్లిసిన్ రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. అయితే నిల్వ చేసిన వెల్లుల్లిలో అల్లిసిన్ ఎక్కువ కాలం ఉండదు. ఇందులో ఫంగస్ వేగంగా వ్యాపిస్తుంది. వెల్లుల్లిని తాజాగా ఉంచడానికి కార్సినో జెనిక్‌ను భారీ పరిమాణంలో ఉపయోగిస్తారని ఆయన వెల్లడించారు.
See Pics: టాలీవుడ్ ఎంట్రీకి ముందే మోడల్ రచ్చ రచ్చ!
వాస్తవానికి వెల్లుల్లి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానంలో ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం కూడా లేదు. కానీ బంగ్లాదేశ్, మయన్మార్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చైనా నుంచి దిగుమతి చేస్తుండగా 400 సంచుల వెల్లుల్లిని తాజాగా కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది.
భారత్ వెన్నులో చైనా వెల్లుల్లి వణుకు!