CBSE 12th Class Exams: దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. 12వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ప్రారంభమైనప్పటి నుంచి సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ విషయంలో ఉత్కంఠత నెలకొంది. సీబీఎస్ఈ బోర్డు(CBSE Board)కు చెందిన 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రాల అభిప్రాయాల్ని కోరింది. ఇవాళ మరోసారి ఈ వ్యవహారమై హై లెవెల్ మీటింగ్‌లో సమీక్షించారు. కరోనా సంక్రమణ నేపధ్యంలో విద్యార్ధుల ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేశారు. ఈ అంశాన్ని పరిగణలో తీసుకుని సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్ని రద్దు (CBSE 12th Exams Cancelled) చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారమే 12వ తరగతి పరీక్ష ఫలితాల్ని రూపొందిస్తారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Also read: 2 DG Medicine: 2 డీజీ మందును ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook