CBSE Board Exams: కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ పరీక్షల్ని నిర్వహిచేందుకే సీబీఎస్ఈ బోర్డు సిద్ధమవుతోంది. అయితే పరీక్ష పాటర్న్ మాత్రం మారబోతోంది. జూలై నెలలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొత్త పాటర్న్ ఎలా ఉంటుందంటే..
దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా విద్యార్ధులు విద్యాసంవత్సరాన్ని, విలువైన కాలాన్ని నష్టపోతున్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపధ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు రద్దు చేస్తారనే ప్రచారం సాగినా..పరీక్షల్ని నిర్వహించేందుకే సీబీఎస్ఈ బోర్డు మొగ్గు చూపింది. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం(Central government) ముందు సీబీఎస్ఈ కొత్త ప్రతిపాదనను ఉంచింది. అయితే కేంద్రం దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
12వ తరగతి పరీక్షలు( 12th class Exams) నిర్వహించేందుకు రెండు పద్ధతుల్ని కేంద్రం ముందుంచింది సీబీఎస్ఈ(CBSE). ఇందులో మొదటి పద్ధతి ప్రకారం పరీక్షల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి నెలలో ప్రీ ఎగ్జామ్స్ యాక్టివిటీస్, రెండవ నెలలో పరీక్షల నిర్వహణ, మూడవ నెలలో ఫలితాల వెల్లడి ఉంటాయి. పరీక్షలు మాత్రం ప్రధాన సబ్జెక్టులకే ఉంటాయి. ఇందులో మార్కుల ఆధారంగా మిగిలిన అంశాల్లో మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం జూన్‌లో పరీక్ష తేదీల్ని ప్రకటించి..జూలై నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.
రెండవ ఆప్షన్ ప్రకారం పరీక్ష సమయాన్ని 90 నిమిషాలు కుదించి..కేవలం 4 సబ్జెక్టుల్లోనే నిర్వహిస్తారు. ఇందులో ఒకటి కచ్చితంగా భాషకు సంబంధించింది అయుండాలి. మిగిలిన మూడు సబ్జెక్టుల్ని విద్యార్దులు ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా విద్యార్ధులు నాలుగు పరీక్షలు రాయల్సి ఉంటుంది. మార్కుల్ని బట్టి మిగిలిన రెండు సబ్జెక్టుల్ని కేటాయిస్తారు.
Also read: ICMR Survey: దేశంలో 40-45 కోట్ల మంది కరోనా బాధితులున్నారట..ఆశ్చర్యంగా ఉందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook