CBSE Exams 10th, 12Th results 2020: న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు గురువారం సుప్రీం కోర్టుకు తేల్చిచెప్పిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE).. జూలై 15లోగా అసెస్మెంట్ ఫలితాలను వెల్లడించనున్నట్టు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. సెప్టెంబర్ నాటికి కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి దేశంలో పరిస్థితులు అనుకూలిస్తే.. అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ని సీబీఎస్ఈ బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించింది. అసెస్మెంట్ ఫలితాల ( Assessment results ) కంటే తమకు మార్కులు అధికంగా వచ్చి ఉండేవి అని విద్యార్థులు భావించినట్టయితే.. అక్టోబర్లో నిర్వహించే పరీక్షలకు వారు హాజరు కావొచ్చని సీబీఎస్ఈ పేర్కొంది. అసెస్మెంట్ స్కీమ్ ( Assessment scheme ) ఆధారంగా ఈ ఫలితాలను ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ కోర్టుకు వివరించింది. సీబీఎస్ఈ వివరణతో సంతృప్తి చెందిన సుప్రీం కోర్టు.. ఈ నోటిఫికేషన్ని ఆమోదించింది. ఐసిఎస్ఈ బోర్డును సైతం సీబీఎస్ఈ బోర్డు తరహాలోనే ఫలితాలను వెల్లడించాల్సిందిగా సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ( CBSE exams cancelled: సీబీఎస్ఇ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం )
సుప్రీం కోర్టు ఆదేశాలపై ఐసిఎస్ఈ బోర్డు స్పందిస్తూ.. వారం రోజుల వ్యవధిలో ఐసిఎస్ఈ బోర్డు ఫలితాలపై ( ICSE Board results 2020 ) తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..