CBSE Result 2022: ఇవాళ 10, 12 తరగతుల టర్మ్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE). ఈ రిజల్ట్ ను బోర్డు అధికారిక వెబ్సైట్ cbseresults.nic.inలో చూసుకోవచ్చు. దాంతో పాటు డిజి లాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG0 యాప్ ద్వారా ఫలితాలను చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
బోర్డు అధికారులు ఏమంటున్నారంటే..
ఈ రోజు ఫలితాలు విడుదలవుతాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే రిజల్ట్ పై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కరోనా (Covid-19) మార్గదర్శకాల కారణంగా పరీక్ష ఫలితాలను విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని బోర్డు అధికారులు చెబుతున్నారు. "కరోనా మహమ్మారి పరిస్థితులు మూల్యాంకన ప్రక్రియపై ప్రభావం చూపాయి, మేము రిజల్ట్స్ ప్రకటించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి, రిజల్ట్స్ తేదీని ఇప్పుడు చెప్పలేం." అని సీబీఎస్ఈ అధికారి ఒకరు తెలిపారు.
రిజల్ట్స్ తెలుసుకోండిలా..
STEP 1: cbse.nic.inకి వెళ్లండి.
STEP 2: 'ఫలితం' విభాగంపై క్లిక్ చేయండి.
STEP 3: రోల్ నంబర్, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
STEP 4: సబ్మిట్ పై క్లిక్ చేసినప్పుడు, రిజల్ట్ మీ స్క్రీన్‌పై కనబడుతుంది
STEP 5: ఫలితాన్ని డౌన్లోడ్ చేసి, దాని ప్రింటౌట్ తీసుకోండి.
టర్మ్-1 పరీక్షలు నవంబర్-డిసెంబర్ 2021లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి, అయితే టర్మ్-2 పరీక్షలు ప్రారంభానికి ముందే.. దేశవ్యాప్తంగా మూడవ వేవ్ (Corona third Wave in India) కరోనా మహమ్మారి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో..టర్మ్-1 బోర్డు పరీక్ష రిజల్ట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే టర్మ్-2 బోర్డు పరీక్ష జరగకపోతే, టర్మ్-1 పరీక్ష మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఫలితాలు విడుదల చేయబడతాయి. 2022 మార్చి-ఏప్రిల్‌లో టర్మ్-2 బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి