CBSE Board Exams 2021 Dates: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించిన మంత్రి

CBSE Board Exams 2021 Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది.

Last Updated : Dec 31, 2020, 07:32 PM IST
  • ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది
  • సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ తేదీలు ప్రకటన
  • మే 4వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు
CBSE Board Exams 2021 Dates: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించిన మంత్రి

CBSE Board Exams 2021 Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. టెన్త్ క్లాస్, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ పరీక్షల షెడ్యూల్‌ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంత్ గురువారం సాయంత్రం వెల్లడించారు.

సీబీఎస్ఈ(CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 10, 12వ తరగతి విద్యార్థులకు మే 4వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల షెడ్యూల్‌తో పాటు ఫలితాల తేదీలపై సైతం మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కాస్త స్పష్టత ఇచ్చారు. జులై 15లోగా ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడంచారు.

Also Read: CBSE Exam 2021: సీబీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షల తేదీలు, నియమాలు ప్రకటించిన బోర్డు

 

సీబీఎస్ఈ ఎగ్జామ్ డేట్స్ షీట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి (Steps To Download CBSE Exam Date Sheet 2021)

సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్  ఓపెన్ చేయండి

అందులో ‘Recent Announcements’ సెక్షన్‌కు వెళ్లండి.

అందులో మీకు కావాల్సిన క్లాస్ ఎంచుకోండి

సీబీఎస్ఈ ఎగ్జామ్ డేట్ షీట్ 2021 డౌన్‌లోడ్ చేసుకోండి

(లేదా) ప్రస్తుతం విడుదల చేసిన ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను సంప్రదించిన తరువాత సీబీఎస్ఈ 2021 పరీక్ష తేదీల(CBSE Board Exam Dates)ను మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నిర్ణయించారు. ఈ ఇబ్బందుల సమయంలో, మేము ఆన్‌లైన్‌లో చాలా పనులు చేశామన్నారు.

Also Read: CBSE Single Girl Child Scholarship 2020: ఇలా చేస్తే ఆ విద్యార్థులకు ప్రతినెలా డబ్బులు!

కానీ ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాలంటే ఆఫ్‌లైన్ పరీక్షలే ముఖ్యమని భావించినట్లు ఇటీవల తెలిపారు. సీబీఎస్ఈ 2021 బోర్డ్ పరీక్షలను నిర్వహించాలనే ఆలోచన ఉంది, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం గురించి మేము ఆలోచించడం లేదన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News