CBSE Board Exam: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ Class 10, Class 12 Time Tables విడుదల, షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి

CBSE Board Exam 2021: Class 10, Class 12 Time Tables 2021 Rleased | నేడు (ఫిబ్రవరి 2న) సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 (CBSE Board Exam 2021 Dates) షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారం 10 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 2, 2021, 09:17 PM IST
  • గత కొన్ని రోజులుగా బోర్డు ఎగ్జామ్‌లలో నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది
  • మే 4 నుంచి సీబీఎస్ 10వ, 12వ తరగతి బోోర్డ్ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల
  • ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంటల వరకు 3 గంటలపాటు పరీక్ష
CBSE Board Exam: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ Class 10, Class 12 Time Tables విడుదల, షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి

CBSE Board Exam 2021: Class 10, Class 12 Time Tables 2021 Rleased | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) పరీక్షల విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్‌ విడుదలైంది. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు.

నేడు (ఫిబ్రవరి 2న) సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 (CBSE Board Exam 2021 Dates) షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారం 10 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది. కొన్ని పరీక్షలు కేవలం రెండు గంటలపాటు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారు.

 

Also Read: NTA యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల, మే నెలలో UGC NET Exam 2021 ఖరారు

 
సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్(CBSE Official Website)లో పరీక్షల పూర్తి షెడ్యూల్ అప్‌లోడ్ చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. 12వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు. మరికాసేపట్లో బోర్డ్ ఎగ్జామ్స్ 2021 తేదీలు విద్యాశాఖ మంత్రి వెల్లడించనున్నారు.

Also Read: Samsung Galaxy A72 Price In India: మార్కెట్‌లోకి రాకముందే శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్ లీక్, Samsung Galaxy A72 Specifications

ఏప్రిల్ చివరి వారంలో సీబీఎస్ బోర్డ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. జూలై 15న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు కరోనా కారణంగా తరగతులు ఆలస్యమయ్యాయని సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించారు.

సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ లింక్

సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ లింక్
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News