కర్ణన్ రాజకీయ పార్టీ.. టికెట్లన్నీ మహిళలకే

అవినీతి నిర్మూలన నినాదంతో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది.

Last Updated : May 17, 2018, 10:41 AM IST
కర్ణన్ రాజకీయ పార్టీ.. టికెట్లన్నీ మహిళలకే

అవినీతి నిర్మూలన నినాదంతో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎస్‌.కర్ణన్‌ పార్టీ స్థాపించనున్నారు. ‘అవినీతి వ్యతిరేక గతిశీల పార్టీ (యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ)’పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆయన కోల్‌కతాలో వెల్లడించారు. 2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేస్తామన్న ఆయన.. టికెట్లన్నీ మహిళలకే కేటాయిస్తామని తెలిపారు.

అవినీతి నిర్మూలనేతమ లక్ష్యమని చెప్పిన ఆయన.. దేశంలో దళితులు, మైనార్టీలపై ఇంకా దాడులు కొనసాగుతుండటం బాధాకరమని అన్నారు. 'అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం ఎంతో గర్వంగా చెప్పుకొంటున్నాం. కానీ.. దళితులు, మైనార్టీలపై కొనసాగుతున్న దాడులను అంతర్జాతీయ సమాజం గమనిస్తూనే ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. డా.బి.ఆర్‌. అంబేద్కర్ సంఘ్‌, దక్షిణాసియా దళిత ఫోరం తదితర హక్కుల సంస్థలు బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కర్ణన్‌ ఈ వివరాలను తెలిపారు. కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు, కోర్టుధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు గత మే 9న కర్ణన్‌కు ఆరునెలల కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Trending News