/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Nitish again NDA: దేశంలో బీహర్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రాజకీయమే వేరు. తన అధికారం నిలబెట్టుకునేందుకు ఏ పార్టీతోనైనా జత కట్టేందుకు వెనుకాడారు. మొన్నటిదాకా కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించిన నితీశ్‌ మళ్లీ బీజేపీతో మైత్రి కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే మరోసారి సీఎం పదవికి రాజీనామా చేయనున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. మహా సంఘటన్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే పక్షంలో చేరడం లాంఛనంగా కనిపిస్తోంది. ఈ కీలక పరిణామాలు ఆదివారం చోటుచేసుకుంటాయని తెలుస్తోంది.

తన రాజకీయ వ్యూహంతో బిహార్‌నే కాదు దేశ రాజకీయాల్లో నితీశ్‌ ప్రకంపనలు రేపుతున్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జేడీతో జతకట్టి మహాఘటబంధన్ మహాకూటమిని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసేందుకు సిద్ధమయ్యారని మూడు రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. మహాఘట్‌బంధన్‌ కూటమి నుంచి నితీశ్‌ కుమార్ విడిపోయి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యాయి.

అసెంబ్లీలో బలబలాలు
మొత్తం అసెంబ్లీ స్థానాలు 243
మెజారిటీకి 122 మంది ఎమ్మెల్యేలు కావాలి
ఆర్‌జేడీ - 79
బీజేపీ - 78
జేడీయూ - 45
కాంగ్రెస్ - 19
ఎంఐఎం -1 
కమ్యూనిస్ టుపార్టీ - 16
హెచ్‌ఏఎం (ఎస్‌) - 4 
స్వతంత్ర ఎమ్మెల్యే -1

ఇప్పుడు నితీశ్‌తో జతకడితే జేడీయూ-బీజేపీ కూటమికి మెజార్టీకి అవసరమైన 122 సీట్ల కన్నా ఒక సీటు అధికంగా (45+78 = 123) వస్తుంది. రాజీనామా చేసిన అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి అనంతరం, బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని బిహార్‌లో చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరూ సీఎం, డిప్యూటీ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో ఇదే పరిణామాలు జరిగితే త్వరలోనే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంది. నితీశ్‌ వెంట కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వెళ్తారని తెలుస్తోంది. ఎలా చూసినా నితీశ్‌ పదవికి వచ్చిన నష్టమేమి లేదు. సునాయాసంగా అవిశ్వాసాన్ని ఎదుర్కొని మరోసారి తన సీఎం పదవిని కాపాడుకోగలరు. కాగా అనూహ్యంగా ఇలా కూటమి మారడం వెనుక నితీశ్‌ ఆలోచన, వ్యూహం ఏమిటో తెలియడం లేదు.

ఇండియా కూటమితో తెగదెంపులు
దేశంలోనే అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడిగా ఉన్న నితీశ్‌ కుమార్‌ తాజా రాజకీయ పరిణామాలతో దేశ రాజకీయాలను సంచలనం రేపారు. ఇప్పటిదాకా ఇండియ కూటమిలో ఉన్న నితీశ్‌ ఇప్పుడు కూటమి మారడంతో దేశంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నితీశ్‌ వలన ఇండియా కూటమిలో ప్రకంపనలు వస్తున్నాయి. ఆయన కూటమి నుంచి వైదొలుగుతున్నారనే అంశంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇండియా కూటమితో నితీశ్‌ ఉంటే ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఉత్సాహాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు.

Also Read: Police Leopard: స్టేషన్‌లోకి దూరిన చిరుతను చూసి దాక్కున్న పోలీసులు.. ఇది పోలీస్‌ పులి

Also Read: Amit Shah Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు.. 'బిహార్‌' పరిణామాలే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Bihar CM Nitish Kumar likely to Resign and JDU again joins in NDA Rv
News Source: 
Home Title: 

Bihar: రేపే బిహార్ సీఎం నితీశ్‌ రాజీనామా? ఎన్డీయేలో చేరడం లాంఛనమే!

Bihar: రేపే బిహార్ సీఎం నితీశ్‌ రాజీనామా? ఎన్డీయేలో చేరడం లాంఛనమే!
Caption: 
Nitish Kumar joins in NDA (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Bihar: రేపే బిహార్ సీఎం నితీశ్‌ రాజీనామా? ఎన్డీయేలో చేరడం లాంఛనమే!
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Saturday, January 27, 2024 - 21:00
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
33
Is Breaking News: 
No
Word Count: 
340