Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..

Bharata Ratna to LK Adwani: భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను రాజకీయాలకు తన జీవితం దేశసేవకు అంకితం చేసిన భారత మాజీ ఉప ప్రధాని, బీజీపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి ప్రదానం చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ ఈరోజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  

Written by - Renuka Godugu | Last Updated : Feb 3, 2024, 02:15 PM IST
Bharata Ratna to LK Adwani: L.k అద్వానీకి భారతరత్న.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ..

Bharata Ratna to LK Adwani: భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను తన జీవితం దేశసేవకు అంకితం చేసిన భారత మాజీ ఉప ప్రధాని, బీజీపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి ప్రదానం చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ ఈరోజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

లాల్ కృష్ణ అద్వానీ భారత జనతా పార్టీ అధినేత. ఈయన మాజీ డిప్యూటీ పీఎం, భారత హోం మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ ఆయన దేశ అభ్యున్నతికి చేసిన కృషిని ప్రజలకు గుర్తుచేసి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎల్ కే అద్వానీ చేసిన పార్లమెంటు నిర్ణయాలు అందరికీ ఆదర్శమని, ఆయనకు ఎంతో అంతర్ధృష్టి ఉందని మోడీ కొనియాడారు. అంతేకాదు నేరుగా ప్రధాని మోడీ అద్వానీని కలిసి భారతరత్నను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు

 

 

 

ఇదీ చదవండి:  EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్‌ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..

ఇదీ చదవండి: Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు

ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ గౌరవం దక్కినందుకు అభినందిస్తునానని, మన కాలంలో అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారక చిహ్నం అని మోడీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

బీజేపీ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి ఉపప్రధానిగా దేశ సేవ చేశారు. అంతేకాదు, హోంమంత్రి, ఐ అండ్ బీ మంత్రిగా కూడా పనిచేశారు అద్వానీ. ఇదిలా ఉండగా 1990 ప్రారంభంలో అయోధ్యలోని రామమందిరం కోసం రథయాత్రను చేపట్టి, బీజీపీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చిన నాయకుడు లాల్ కృష్ణ అద్వానీని నేడు దేశ అత్యున్నత పురస్కారం లభించింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News