Bank Holidays in November 2020: నవంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

November 2020 Bank Holidays  | ఇతరత్ర పనులను పక్కనపెడితే ఆర్థిక లావాదేవీలు మాత్రం ప్లాన్ చేసుకుని చేయడం ఉత్తమం. కరోనా, లాక్‌డౌన్ సమయాల్లో డబ్బు అందుబాటులో ఉండటం చాలా అవసరం. నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays In November 2020) తెలుసుకుని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ నెలలో మొత్తం 8 సెలవు దినాలు.

Last Updated : Oct 30, 2020, 05:54 PM IST
  • నవంబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 8 సెలవు దినాలు
  • ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది
  • ఈ నెలలో 5 ఆదివారాలు కనుక ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు
Bank Holidays in November 2020: నవంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

SBI Holidays In November 2020 | అసలే కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇతరత్ర పనులను పక్కనపెడితే ఆర్థిక లావాదేవీలు మాత్రం ప్లాన్ చేసుకుని చేయడం ఉత్తమం. కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయాల్లో చేతిలో డబ్బు లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్నవారు కనిపిస్తుంటారు. మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా.. అయితే నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays In November 2020) తెలుసుకుని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ నెలలో మొత్తం 8 సెలవు దినాలు.

 

నవంబర్ నెలలో 5 ఆదివారాలు అంటే ఇవి 5 సెలవు దినాలు. నవంబర్ 1, 8, 15, 22 మరియు నవంబర్ 29 తేదీలు ఆదివారాలు కనుక ఆ రోజులలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే విధంగా రెండు, నాలుగో శనివారాలలోనూ బ్యాంకులు పనిచేయవు. సిబ్బందికి సెలవు ఉంటుంది. నవంబర్ 7 మరియు 14 తేదీలైన రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. మరోవైపు నవంబర్ 14న బాలల దినోత్సవం, దీపావళి పండుగ వచ్చాయి. 

 

నవంబర్ 30న గురునానక్ జయంతి వచ్చింది. ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటితో పాటు ఒక్కో రాష్టాన్ని ఇతరత్రా సెలవు దినాలు వర్తిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే బ్యాంకు సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయని తెలిసిందే. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/ లో వివరాలు చెక్ చేసుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News