Kozhikode Airport: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలం తాజా దృశ్యాలు

కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India flight crash-landing) జరిగిన చోట పరిస్థితి చాలా భయంకరంగా కనిపిస్తోంది. విమానం రన్ వే పై నుంచి జారి ప్రమాదానికి గురైన తీరు, అనంతరం ఆ విమానం రెండు ముక్కలైన తీరు చూస్తే.. ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Last Updated : Aug 8, 2020, 11:50 AM IST
Kozhikode Airport: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలం తాజా దృశ్యాలు

కొజికోడ్: కేరళలోని కొజికోడ్ విమానాశ్రయంలో  ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India flight crash-landing) జరిగిన చోట పరిస్థితి చాలా భయంకరంగా కనిపిస్తోంది. విమానం రన్ వే పై నుంచి జారి ప్రమాదానికి గురైన తీరు, అనంతరం ఆ విమానం రెండు ముక్కలైన తీరు చూస్తే.. ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. విమాన ప్రమాదం ఘటన స్థలాన్ని పరిశీలించిన విదేశాంగ సహాయ శాఖ మంత్రి వి మురళీధరన్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. తాను ఇప్పుడే విమానం శిథిలాలను పరిశీలించానని, ఘటనాస్థలం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. సహాయ కార్యక్రమాల్లో భాగంగా విమానంలోని కొంత భాగాన్ని రెస్క్యూ సిబ్బంది ముక్కలు చేసి వేరు చేసినట్టు మురళీధరన్ తెలిపారు. Also read: Kozhikode flight crash: విమానం కూలిపోవడానికి ఈ 3 అంశాలే ప్రధాన కారణమా ?

 

పౌర విమానయాన శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పురి మధ్యాహ్నం 12 గంటలకు కొజికోడ్ విమానాశ్రయం ( Kozhikode Airport in Karipur ) ఘటనస్థలాన్ని పరిశీలించేందుకు వస్తున్నారని మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వద్ద తాజా పరిస్థితికి సంబంధించిన దృశ్యాలను ఏఎన్ఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. Also read: Flight crash: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే

Trending News