8th Pay Commission Impact in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆనందం నెలకొంది. ఎందుకంటే 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది ఉద్యోగులు ఈ వేతన సంఘం ద్వారా లబ్ది పొందనున్నారు. 8 వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏ మేరకు పెరుగుతుందో తెలుసుకుందాం.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ప్రతి నెలా జీతంతో పాటు పెన్షన్, అలవెన్సులు అన్నీ పెరుగుతాయి. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది. దీనిని బట్టే జీతం పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. 6వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 ఉంది. ఆ సమయంలో కనీస వేతనం 7 వేలుంది. ఆ తరువాత 7వ వేతన సంఘం అమల్లోకి రాగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అవడంతో కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. అందుకే ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా కాలంగా ఎదురుచూశారు. ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 లేదా అంతకంటే ఎక్కువ కావచ్చని అంచనా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరుగుతుంది.
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే కనీస వేతనం 18 వేల నుంచి ఏకంగా 51 వేల రూపాయలకు పెరుగుతుంది. అదే సమయంలో పెన్షన్ 9 వేల నుంచి 27 వేలకు పెరుగుతుంది. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరుగుతుంది.
8వ వేతన సంఘం..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పింఛను సరిచేసేదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఇది వివిధ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. గ్రాస్ శాలరీ, పింఛనుపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగుల కొనుగోలు శక్తి పెంచేందుకు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చేందుకు సహాయపడుతుంది.
8వ వేతన సంఘం..ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఖరారు చేస్తారు
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలనేది ఉద్యోగ సంఘాల డిమాండ్. ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలను పరిగణలో తీసుకుని జీతాలు తగినంతగా పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి, ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకుని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఖరారవుతుంటుంది.
Also read: PPF 5 Benefits: పీపీఎఫ్ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే కలిగే 5 అతిపెద్ద లాభాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి