7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు

Tamil Nadu Announces 4 percent DA Hike: తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 42 శాతం నుంచి 46 శాతానికి డీఏ చేరింది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2023, 08:17 AM IST
7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు

Tamil Nadu Announces 4 percent DA Hike: ఉద్యోగులు, పెన్షనర్లకు తమిళనాడు ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన చేసింది. 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ పెంపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 16 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.2,546.16 కోట్ల అదనపు భారం పడనుంది. తాజాగా నాలుగు శాతం పెంచడంతో రాష్ట్రంలో ఉద్యోగుల డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి చేరింది. దీపావళికి ముందు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"జూలై 1, 2023 నుంచి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో డియర్‌నెస్ అలవెన్స్‌ను 42% నుంచి 46%కి పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో  రూ.2,546.16 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అదనపు నిధులను కేటాయిస్తుంది. గత ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల భారాన్ని మిగిల్చినా.. ప్రస్తుతం ప్రభుత్వం అధికారులు, ఉపాధ్యాయుల వివిధ డిమాండ్లను నెరవేర్చడానికి దశలవారీగా నెరవేర్చడానికి కృషి చేస్తోంది" అని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గత వారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా తమ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 42 శాతం నుంచి 46 శాతానికి పెంచినట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. పెంచిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది.

Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి   

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News