DA Hike: ఈ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం భారీ కానుక.. జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్

7th Pay Commission DA Hike News: డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెల నుంచి పెంచిన డీఏను అందజేస్తున్నట్లు వెల్లడించింది. కేరళ ఆర్థిక శాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 11:23 PM IST
DA Hike: ఈ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం భారీ కానుక.. జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్

7th Pay Commission DA Hike News: ఉద్యోగులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ కానుకను అందించింది. ఈ ఏడాది మొదటి డియర్‌నెస్ అలవెన్స్‌పై కీలక ప్రకటన చేసింది. మొదటి విడత డీఏ ఏప్రిల్‌లో అందజేస్తున్నట్లు వెల్లడించింది. సోమవారం కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ హోల్డర్లకు పెరిగిన డీఏ ఏప్రిల్‌లో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 

Also Read: MLC Kavitha: పోలీసుశాఖకు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్.. సీఎం రేవంత్ పై కేసు పెట్టాలి.. లేకపోతే..

2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి బాలగోపాల్.. అనంతరం‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పెన్షన్‌ విధానంతో పాటు భవిష్యత్‌లో ఉద్యోగులకు గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. అయితే దీనిపై సమీక్షిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సామాజిక భద్రత పెన్షన్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదని వెల్లడించారు.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డీఏ పెంపుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు ప్రకటించారు. కొత్త పే స్కేల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 6 శాతం డీఏను విడుదల చేసిందని.. నాలుగేళ్లలో రూ.4,144 కోట్లు ఖర్చు చేశామని మమతా బెనర్జీ తెలిపారు. అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా డిసెంబర్ 20న డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 55 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబరు వేతనాన్ని ముందస్తుగా విడుదల చేయడంతోపాటు మూడు శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంపు తర్వాత డీఏ 38 శాతానికి పెరుగుతుందని పంజాబ్ స్టేట్ మినిస్టీరియల్ సర్వీసెస్ యూనియన్ (పీఎస్‌ఎంఎస్‌యూ) అధ్యక్షుడు అమ్రిక్ సింగ్ తెలిపారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరోసారి 4 శాతం డీఏ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తుండగా.. ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది. హోలీ సందర్భంగా ప్రకటిస్తుందా.. లేదా అంతకంటే ముందే ప్రకటిస్తుందా అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి డీఏ పెంపు వర్తించనుంది. 

Also Read; Nothing Phone 2a: నథింగ్ 2ఎ ఫోన్‌పై కీలక అప్‌డేట్.. లీకైన ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News