Punjab DA Hike: 'దీపావళి' ధమాకా ఆఫర్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ!

Punjab Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పంజాబ్‌ ప్రభుత్వం డీఏను 6 శాతం పెంచుతుందని సమాచారం.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 21, 2022, 01:40 PM IST
  • ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
  • 6 శాతం పెరిగిన డీఏ
  • దీపావళికి డబ్బేడబ్బు
Punjab DA Hike: 'దీపావళి' ధమాకా ఆఫర్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ!

Punjab Govt Employees will get 6 percent Dearness Allowance hike on Diwali 2022: ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్నిపెంచుతూ సెప్టెంబర్ చివరి వారంలో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూలై నెల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఉద్యోగులకు మూడు నెలల బకాయిలును వెంటనే ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు డీఏ పెంపును ప్రకటించాయి.

పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం దీపావళికి ముందు డీఏను పెంచనుందట. భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏని నేడు  పెంచుతుందని సమాచారం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే.. పంజాబ్ ప్రభుత్వం కూడా 4 శాతం డీఏను పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ట్రిబ్యూన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. శుక్రవారం జరిగే పంజాబ్ క్యాబినెట్ సమావేశంలో డీఏ పెంపుకు ఆమోదం లభిస్తుందని తెలుస్తోంది.

ట్రిబ్యూన్‌లో ప్రచురితమైన వార్త ప్రకారం.. పంజాబ్‌ ఆర్థిక శాఖ 6 శాతం డీఏ ఆమోదం కోరుతూ ఫైల్‌ను సీఎంకు పంపిందట. సీఎం భగవంత్ మాన్ ఆమోదం తర్వాత.. డీఏ పెంపుపై నేడు జరిగే మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపును పరిగణనలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా నేటి సాయత్రం వరకు డీఏ పెంపు ఎంతన్నది తేలనుంది. 

ఇంతకుముందు హర్యానా ప్రభుత్వం తమ రాష్ట్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచింది. దాంతో హర్యానాలో ఉద్యోగుల డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది. జూలై 1 2022 నుంచి 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ వర్తిస్తుంది. ఉద్యోగులకు పెంచిన డీఏను అక్టోబరు నెల జీతంలో చెల్లిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం.. జనవరి మరియు జూలైలలో డీఏ పెంచుతున్న విషయం తెలిసిందే.

Also Read: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. రెండుసార్లు ఛాంపియన్ విండీస్ ఔట్! సూపర్ 12కు ఐర్లాండ్

Also Read: రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ షో.. లెహంగాలో కూడా అన్ని చూపించేస్తుందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News