New Year Celebrations: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. 2023కు ఘనంగా వీడ్కోలు పలికి.. 2024కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పటికే అక్కడికి వెళ్లాలని.. ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఇంకా ప్లాన్ చేయకపోతే.. బడ్జెట్‌లో తిరిగి వచ్చే ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు ఫ్రెండ్స్‌తో వెళ్లి చిల్ అవ్వాలని అనుకుంటున్నా.. ఫ్యామిలీతో కలిసి విహారయాత్రను వెళ్లాలని అనుకున్నా మనదేశంలో చాలా ప్లేస్‌లు ఉన్నాయి. టాప్-10 బెస్ట్ విజిట్ ప్లేస్‌లు ఇవే..
1.గోవా: ఉల్లాసమైన పార్టీలు, అద్భుతమైన బీచ్‌లకు వేదిక గోవా. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటారు. బీచ్ వద్ద ఎంజాయ్ చేస్తూ న్యూఇయర్ వేడుకలు జరుపుకోవచ్చు.
2.పాండిచ్చేరి: ఫ్రెంచ్ కలోనియల్ శోభతో, నిర్మలమైన బీచ్‌లతో పాండిచ్చేరి నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. బీచ్ సైడ్ క్లబ్‌లలో పార్టీలు చేసుకోవచ్చు.
3.రిషికేశ్: ఆధ్యాత్మిక మార్గంలో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని ప్లాన్ చేసుకోవాలని అనుకున్నట్లయితే రిషికేశ్ మంచి ఆప్షన్. యోగా, మెడిటేషన్ పాల్గొనవచ్చు. రివర్ రాఫ్టింగ్ వంటి ఉత్కంఠభరితమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు.
4.మెక్‌లియోడ్ గంజ్: హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన కొండల్లో నెలకొని ఉన్న మెక్‌లియోడ్ గంజ్ ప్రశాంతమైన వాతావరణానికి పెట్టింది పేరు. మీరు టిబెటన్ సంస్కృతిని ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇక్కడ దలైలామా ఆలయాన్ని సందర్శించవచ్చు.
5.కసోల్: మన దేశంలో 'మినీ ఇజ్రాయెల్'గా పిలుచుకునే కసోల్ బ్యాక్‌ప్యాకర్లు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడ సమీపంలోని గ్రామాలకు ట్రెక్కింగ్ చేయవచ్చు. నది ఒడ్డున క్యాంప్ చేయవచ్చు. స్థానిక వంటకాలను ఆస్వాదించవచ్చు.
6.గోకర్ణ: కర్ణాటకలో ఉన్న గోకర్ణం సహజమైన బీచ్‌ల వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. యోగా తరగతులలో పాల్గొనవచ్చు. రుచికరమైన సముద్రపు ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
7.హంపి: పురాతన శిథిలాలు, నిర్మాణ అద్భుతాలకు ప్రసిద్ధి చెందిన హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. చారిత్రక ప్రదేశాలను చూసుకోవచ్చు. రాక్ క్లైంబింగ్‌కు వెళ్లవచ్చు.
8.పుష్కర్: ఒంటెల ఉత్సవం, పవిత్ర సరస్సుకు ప్రసిద్ధి చెందిన పుష్కర్ ఒక శక్తివంతమైన, సాంస్కృతిక ప్రదేశం. సాంప్రదాయ రాజస్థానీ జానపద ప్రదర్శనలను చూడవచ్చు. పవిత్ర సరస్సులో స్నానం చేయవచ్. ప్రత్యేకమైన హస్తకళల కోసం షాపింగ్ చేయవచ్చు.
9.ఉదయపూర్: 'సరస్సుల నగరం'గా ప్రసిద్ధి చెందింది ఉదయపూర్. మీరు పిచోలా సరస్సులో పడవ ప్రయాణం చేయవచ్చు. అద్భుతమైన సిటీ ప్యాలెస్‌ని సందర్శించవచ్చు. రుచికరమైన రాజస్థానీ వంటకాలను ఆస్వాదించవచ్చు.
10.మనాలి: మంచుతో కప్పిన పర్వతాలు.. పచ్చని లోయలతో ఆహ్లాదకరమైన ప్రదేశానికి మనాలి కేరాఫ్ అడ్రస్. స్కీయింగ్, ట్రెక్కింగ్, హిమాలయాల అందాలను వీక్షించవచ్చు.
Also Read: ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ.. ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!
Also Read: Pawan Kalyan: ఏపీలో భారీ అవినీతి.. సీబీఐ విచారించండి.. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter