Winter Best Fruits: శీతాకాలంలో ఈ పండ్లు తింటే శరవేగంగా బరువు తగ్గడం ఖాయం

Winter Best Fruits: శీతాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో సహజంగానే జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు బాధిస్తుంటాయి. ఇమ్యూనిటీ తగ్గడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2023, 03:58 PM IST
Winter Best Fruits: శీతాకాలంలో ఈ పండ్లు తింటే శరవేగంగా బరువు తగ్గడం ఖాయం

Winter Best Fruits: శీతాకాలంలో అనారోగ్యం కారణంగా బరువు నియంత్రణ కూడా కష్టం కావచ్చు. అందుకే డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి చాలా విముక్తి పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

చలికాలంలో ఓ వైపు ఆరోగ్యం పాడవుతుంది. మరోవైపు చలి వల్ల బద్దకం పెరుగుతుంది. చలి వల్ల బయటకు రావడమే తగ్గించేస్తారు. చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో జలుబు, దగ్గు, జ్వరం, జాయింట్ పెయిన్స్ అతి ముఖ్యమైనవి. బరువు ఎక్కువగా ఉండేవారికి అంటే స్థూలకాయంతో ఉండేవారికి ఈ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే డైట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా సీజనల్ ఫ్రూట్స్ తినడం ద్వారా శరీరం బరువు తగ్గించుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ తినడం ద్వారా ఎనర్జీ కూడా సంపాదించుకోవచ్చు. శీతాకాలంలో లభించే పండ్లు తింటే శరీరం పూర్తి ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇందులో పైబర్, విటమిన్, మినరల్స్ ప్రధానంగా అవసరమౌతాయి. వీటి కోసంం సీజనల్ ఫ్రూట్స్ మంచి ప్రత్యామ్నాయం.

శీతాఫలం

చలికాలంలో మాత్రమే లభించే అద్భుతమైన ఫ్రూట్ ఇది. కస్టర్డ్ యాపిల్ అంటారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్లు, మినరల్స్ కారణంగా శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. శీతాఫలాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. 

ఆరెంజ్

ఆరెంజ్ అంటేనే విటమిన్ సికు కేరాఫ్. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా పయోగపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం, మినరల్స్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.

ఆపిల్

ఆపిల్ అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే దాదాపు అన్ని రకాల వ్యాధులు దూరమౌతాయంటారు. అందుకే ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు. ఇందులో పైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. చలికాలంలో బరువు తగ్గించుకునేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఆపిల్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు గమనించవచ్చు.

జామ

ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ భారీగా ఉంటాయి. ఇది తినడం వల్ల ముందు ఓవర్ ఈటింగ్ తగ్గిపోతుంది. దాంతోపాటు ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా బరువు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. జామ అనేది మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు దోహదమౌతుంది. 

దానిమ్మ

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలాతక్కువ. రుచితో పాటు చాలా ఆరోగ్యకరమైంది.  వర్కవుట్స్ చేసేటప్పుడు బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. రోజూ దానిమ్మ తినడం వల్ల శరీరంలో ట్రై గ్లిసరైడ్స్ తగ్గుతాయి. 

కివీ

ఇది ఆరోగ్యపరంగా అత్యుత్తమమైందని అంటారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. కివీ రుచికరంగా కూడా ఉండటంతో చాలామంది ఇష్టంగా తింటారు. కివీ క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యానికి ప్రయోజనమే కాకుండా బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

Also read: Morning Sickness Remedies: గర్భిణీ స్త్రీలు మార్నింగ్ సిక్నెస్ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News