Weight Loss Exercise: బరువు తగ్గించాలనుకుంటున్నారా? వీటికి కేవలం 20 నిమిషాలు కేటాయించడి చాలు!

Weight Loss Exercise: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ కూడా కరిగించుకోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 06:17 PM IST
Weight Loss Exercise: బరువు తగ్గించాలనుకుంటున్నారా? వీటికి కేవలం 20 నిమిషాలు కేటాయించడి చాలు!

Weight Loss Exercise: బరువు తగ్గడానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంత కీలకమో..వ్యాయాలు కూడా అంతే కీలకమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంగా ఉంటే, వ్యాయామలు చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాకుండా మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వ్యాయాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లోనే ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గడానికి ప్రతి రోజు చేయాల్సిన వ్యాయామాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.  

ఇంట్లోనే బరువు తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు:
స్క్వాట్స్: 

ఉదయం ప్రతి రోజు స్క్వాట్స్ చేయడం వల్ల కాళ్లు, తొడల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అంతేకాకుండా బాడీలోని కొలెస్ట్రాల్‌ కూడా కరగడం ప్రారంభమవుతుంది. దీని కోసం ముందుగా తుంటిని వెనక్కి వంచి, మోకాళ్ళను ఒంచుకుని కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 10 నుంచి 15 సార్లు చేయండి.

హింగ్స్: 
ఈ హింగ్స్ ఫోజ్‌ ప్రతి రోజు చేయడం వల్ల తుంటి, వీపు కండరాలు కూడా దృఢంగా తయారవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ప్రతి రోజు కాళ్లను భుజాల వెడల్పు ఉంచి, తలను ముందుకు వంచి..పైకి లేవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 10 నుంచి 12 సార్లు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. 

లంజెస్: 
స్క్వాట్స్, బెండ్స్ కలిపి చేసే వ్యాయామే లంజెస్. దీనిని వేయడం చాలా సులభం..దీని కోసం ఒక కాలును ముందుకు, మరొకదాన్ని వెనక్కి ఉంచి, కిందకు వంచాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 10 నుంచి 12 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

పుష్-అప్స్: 
ఈ పుష్-అప్స్ వ్యాయామం చేయడం చాలా సులభం. ఈ వ్యాయామాన్ని ప్రతి రోజు వేయడం వల్ల చేతులు, ఛాతీ కండరాలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఈ పుష్-అప్స్‌ను 5 నుంచి 10 రోజు చేయాల్సి ఉంటుంది. 

ప్లాంక్: 
ప్లాంక్ వ్యాయామం చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News