Sapodilla Or Chikoo Feel Shake For Weight Loss: సపోటా శరీరానికి చాలా మంచిది ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ బి, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సపోటానే కాకుండా సపోటా ఫీల్స్‌తో తయారు చేసిన రసం అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ షేక్‌లో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పీల్ షేక్‌లో ఫైబర్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే సపోటా ఫీల్ షేక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సపోటా ఫీల్ షేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
❈ 1 కప్పు కడిగిన సపోటా ఫీల్స్ ముక్కలు
❈ 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్
❈ 3 కప్పుల పాలు
❈ 1 టీస్పూన్ చక్కెర
❈ 7 నుంచి 8 ఐస్ క్యూబ్స్
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
సపోటా ఫీల్ షేక్ తయారీ పద్థతి:
❈ ఈ షేక్ తయారు చేయడానికి ముందుగా సపోటా ఫీల్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
❈ ఆ తర్వాత సపోటా ఫీల్స్ బాగా కడిగి గ్రైండ్ చేయాలి.
❈ ఇలా గ్రైడ్ చేసే క్రమంలోనే పాలను వేసి బాగా మిక్స్ చేయాలి.
❈ ఆ తర్వాత పంచదార, 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్, 1 టీస్పూన్ కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది.
❈ ఇలా వీటిని బాగా మిక్సీ పట్టుకుని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి.
❈ గ్లాసులోకి తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే, శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కులుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook