Pomegranate Health Benefits: దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది రక్తాన్ని నింపుతుంది. ఇందులోని పాలిఫెనల్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్తనాళాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇందులో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
యాంటీ ఆక్సిడెంట్లు..
దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్‌ను సమం చేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి ప్రాణాంతక గుండె సమస్యలు, కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
గుండె ఆరోగ్యం..
దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు రక్తసరఫరాను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు..
దానిమ్మ రసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో వాపు సమస్యను తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన ఆర్థరైటీస్ , డయాబెటిస్, కేన్సర్ నుంచి దూరంగా ఉంచుతాయి.
జీర్ణక్రియ..
దానిమ్మ రసం జీర్ణసమస్యలకు సహజసిద్ధమైన రెమిడీ. ఇది డయేరియా, పేగు సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. దానిమ్మలో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండి మలబద్ధకం సమస్యను రాకుండా కాపాడుతుంది.
ఇమ్యూనిటీ..
దానిమ్మలో విటమిన్ సీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.
కేన్సర్‌కు చెక్..
కొన్ని నివేదికల ప్రకారం దానిమ్మ రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వల్ల కేన్సర్ సెల్స్ పెరగకుండా ఉంటాయి. బ్రేస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ కణాలను పెరగకుండా దానిమ్మ కాపాడుతుంది.
ఇదీ చదవండి: కీరదోసకాయ వడదెబ్బకు చెక్ పెడుతుంది.. మరో 5 ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
ఆరోగ్యకరమైన చర్మం..
దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు రాకుండా స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.
బ్రెయిన్ పనితీరు..
తరచూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ వచ్చే అల్జీమర్స్ సమస్య రాకుండా నివారిస్తుంది దానిమ్మ.
ఇదీ చదవండి: ఈ 8 పండ్లు తింటూ బరువు ఫాస్ట్ గా తగ్గొచ్చని మీకు తెలుసా?
బ్లడ్ షుగర్..
ఇన్సూలిన్ సెన్సిటివిటీని దానిమ్మ మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ నిర్వహిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు దానిమ్మ తీసుకోవచ్చే.
బరువు నిర్వహణ..
దానిమ్మ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో బరువు పెరుగుతారనే బాధే ఉంటదు. దానిమ్మలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీంతో ఎక్కువగా తినరు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook