Can stress lead to Covid-19: ఒత్తిడికి గురైన వారికే కరోనా వస్తుందా?

Can stress lead to Covid-19: కొవిడ్ సమయంలో చాలా మంది ఒత్తిడి, ఆందోలన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే ఒత్తిడి కొవిడ్​ సోకేందుకు కారణం అవుతుందా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 10:43 PM IST
  • కొవిడ్​పై ఓ అధ్యాయనంలో విస్తుపోయే విషయాలు
  • ప్రజల్లో ఆందోళనలు, నిరాశ పెరిగినట్లు వెల్లడి
  • కొవిడ్​ సోకే ప్రమాదం కూడా..
Can stress lead to Covid-19: ఒత్తిడికి గురైన వారికే కరోనా వస్తుందా?

Can stress lead to Covid-19: కరోనా సోకడం గురించి ఓ ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. 'అన్నల్స్ ఆఫ్ బిహేవియరల్​ మెడిసిన్​ జర్నల్​'లో ప్రచురితమైన ఓ జర్నల్​లో.. ఎవరైతే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్​తో బాధపడుతుంటారో.. వారికి కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని (Can stress lead to Corona) తెలిసింది.

కొవిడ్ మొదటి దశలో ఆందోళనలు..

కొవిడ్​ తొలి నాళ్లలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. లాక్​డౌన్ విధించడం వంటివి చేశాయి. చాలా మంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు.

లాక్​డౌన్ వంటి పరిస్థితులు ప్రజల మానసిక ఆరోగ్యపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వర్క్ ఫ్రం హోం కారణంగా పని సమయాలపై నియంత్రణ లేకపోవడం కూడా మానసిక ఆరోగ్యపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనితో చాలా మంది నిరాశ, చికాకు అలసట, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొన్నారని పలు నివేదికల్లో (Studies on Corona) వెల్లడైంది.

ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న చాలా మంది కొవిడ్ బారిన పడ్డట్లు అధ్యాయనం పేర్కొది. అంతే కాకుండా కొవిడ్ లక్షణాలు కూడా సాధారణ వ్యక్తులతో పోలిస్తే అధికంగా ఉన్నట్లు (Corona in stressed people) తెలిసింది.

ఈ అధ్యాయానాన్ని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్​హమ్​లోని స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​ నిర్వహించింది. దీనికి ప్రొఫెసర్​ కవిత వేధార నేతృత్వం వహించారు.

మరిన్ని విషయాలు..

ఈ అధ్యాయనం గురించి మాట్లాడిన ప్రొపెసర్ వేధార కవిత.. కరోనా కాలంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్​ వంటివి పెరిగటం మాత్రమే కాకుండా.. అవన్ని కొవిడ్​ ప్రమాదాన్ని పెంచుతున్నాయని కూడా పేర్కొన్నారు.

మొత్తం 1,100 వయోజనుల నుంచి సేకరకించిన శాంపిళ్ల ద్వారా ఈ పరిశోధన జరిగింది. 2020 ఏప్రిల్​లో ఈ సర్వేను నిర్వహించగా.. దీనికి సంబంధించిన లక్షణాలను 2020 డిసెంబర్​లో నివేదించారు.

ఈ అధ్యాయనానికి ముందు కూడా.. మానసిక సమస్యలు కూడా శ్వసకోస సంబంధి వ్యాధులకు కారణం అవుతాయని (Corona due to mental health problems) తేలింది.

Also read: Paracetamol dose: పారాసిటమోల్, డోలో, క్రోసిన్, కాల్పోల్ ఏయే వయస్సుల వారికి ఎంత డోస్ అవసరమో తెలుసా?

Also read: Rose Water Health Benifits : రోజ్ వాటర్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News