Kidney Problems Symptoms: మీ శరీరంలోని ఆ 3 భాగాల్లో నొప్పిగా ఉందా..అయితే మీ కిడ్నీ పాడైనట్టే

Kidney Problems Symptoms: శరీరంలో కొన్ని అవయవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి కిడ్నీ. కిడ్నీ వ్యాధి ప్రాణాంతకమైందే. అందులే అప్రమత్తంగా ఉండాలి. మీ శరీరంలోని 3 భాగాల్లో నొప్పి ఉంటే..కిడ్నీ సమస్య ఉందని అర్ధం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 6, 2022, 08:23 PM IST
Kidney Problems Symptoms: మీ శరీరంలోని ఆ 3 భాగాల్లో నొప్పిగా ఉందా..అయితే మీ కిడ్నీ పాడైనట్టే

Kidney Problems Symptoms: శరీరంలో కొన్ని అవయవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి కిడ్నీ. కిడ్నీ వ్యాధి ప్రాణాంతకమైందే. అందులే అప్రమత్తంగా ఉండాలి. మీ శరీరంలోని 3 భాగాల్లో నొప్పి ఉంటే..కిడ్నీ సమస్య ఉందని అర్ధం..

కిడ్నీ అనేది మనిషి శరీరంలోని కీలకమైన భాగాల్లో ఒకటి. కిడ్నీలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా..రక్తాన్ని పరిశుభ్రం చేయడంలో అంటే ఫిల్టర్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే కిడ్నీపై దుష్ప్రభావం పడినా లేదా ఏదైనా సమస్య తలెత్తినా ఆ వ్యక్తికి అనారోగ్య సమస్యలు కచ్చితంగా ఎదురౌతాయి. కిడ్నీలు పాడైతే శరీరంలోని కొన్ని భాగాల నుంచి సంకేతాలు వెలువడతాయి. వాటి ద్వారా కిడ్నీలో సమస్య ఉందని పసిగట్టవచ్చు. శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంది. శరీరంలోని ఏ భాగాల్లో నొప్పి వస్తుంది, కిడ్నీలు పాడైతే కన్పించే ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీలు పాడైతే ఏ భాగాల్లో నొప్పి ఉంటుంది

1. కిడ్నీలు పాడైతే ముందుగా ఆ వ్యక్తి ఛాతీలో నొప్పి వస్తుంది. ఎందుకంటే కిడ్నీకు ఛాతీకు ఒకదానికొకటి సంబంధముంది. కిడ్నీలు పాడైతే గుండెను కప్పే కవచం వాచిపోతుంది. ఫలితంగా వ్యక్తి ఛాతీలో నొప్పిగా ఉంటుంది. 

2. కిడ్నీల్లో ఏదైనా సమస్య తలెత్తినా లేదా పాడైనా..ఆ వ్యక్తి వీపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే కిడ్నీ దీర్ఘకాలం యూరిన్ ఉత్పత్తి చేయలేదు. దాంతో వీపులో నొప్పి ఉంటుంది. వీపు నొప్పి దీర్ఘకాలంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది కిడ్నీ పాడైన లక్షణాల్లో ఒకటి.

3. పిల్లల్లో కిడ్నీ సమస్య ఏర్పడితే..కడుపు దిగువ భాగంలో నొప్పి వస్తుంది. మూత్రాశయం వద్ద నొప్పి లేదా మంట ఉంటే అది ఇన్‌ఫెక్షన్ సమస్య కూడా కావచ్చు. ఈ సమస్య కన్పించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Also read: Polluted Water: కలుషిత నీరు తాగితే ఏయే రకాల అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News