Iron Deficiency: తరచుగా కళ్ళు తిరుగుతున్నాయా? ఇవి పాటించడం తప్పనిసరి

Iron Deficiency: శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైనది. ఐరన్ రక్తహీనతను నివారించడంలో, శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో.. సహాయపడుతుంది. ప్రతి రోజూ సరిపడా ఐరన్ మోతాదును పొందడం అవసరం. మరి అంత ముఖ్యమైన ఐరన్ ఎలాంటి.. ఆహార పదార్థాలలో దొరుకుంతుందో చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 19, 2024, 09:41 PM IST
Iron Deficiency: తరచుగా కళ్ళు తిరుగుతున్నాయా? ఇవి పాటించడం తప్పనిసరి

Iron Rich Foods: మనలో చాలామంది ప్రతిరోజు సరిపడా ఐరన్ మోతాదు పొందడం లేదు. మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ రక్తహీనతను నివారించడంలో, మన శరీరంలోని చాలా వరకు అవయవాలు మెరుగ్గా.. పనిచేయడానికి చాలా అవసరం. అందుకే ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తినడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు మన శరీరానికి ఐరన్ ను మెరుగ్గా గ్రహించడానికి సహాయపడతాయి. కానీ కాఫీ, టీ వంటి పానీయాలు మాత్రం ఐరన్ గ్రహించడాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యానికి ఎంతగానో అవసరం అయిన ఐరన్ ను ఆహారంలోకి చేర్చడానికి కొన్ని సులభమైన మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడం కూడా ముఖ్యమే.

ఆహారంలో ఐరన్ రకాలు:

హీమ్ ఐరన్: ఇది మన శరీరంలో చాలా త్వరగా అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి మోతాదు తక్కువగా ఉన్నా కూడా తిన్న ఆహారాన్ని బట్టి ఐరన్ మన శరీరానికి సరిపడా వస్తుంది. ఇది హిమోగ్లోబిన్ నుండి వస్తుంది. ఇది మాంసం, చికెన్, సముద్ర ఆహారంలో సాధారణంగా ఉంటుంది. 

నాన్-హీమ్ ఐరన్: ఇది మన శరీరంలో కలవడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. నాన్-హీమ్ ఐరన్ సాధారణంగా పప్పులు (బీన్స్), నట్లు, విత్తనాలు, కొన్ని కూరగాయలు, టోఫు, ధాన్యాలు, బ్రెడ్, తృణధాన్యాల వంటి వాటిల్లో ఉంటుంది.

అసలు ఐరన్ అవసరమేమిటి?

ఐరన్ అనేది హిమోగ్లోబిన్ కోసం చాలా ముఖ్యమైనది. మన శరీరా అవయవాలు అన్నిటికీ ఆక్సిజన్ తీసుకెళ్లడంలో మన కణాలు శక్తిని ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైనది. మనకు సరిపడా ఐరన్ లేకపోతే, ఆక్సిజన్ ను అన్ని అవయవాలకు తీసుకెళ్లడానికి తగినంత ఎర్ర రక్త కణాలు కూడా ఉండవు.

తగినంత ఐరన్ లేకపోతే రక్తహీనత వస్తుంది. సాధారణ పోషక లోపం వల్ల అలసట, బలహీనత,  పసుపు చర్మం, తలతిరగడం, తలనొప్పి, వంటివి ఐరన్ తగ్గింది అని సూచించే సంకేతాలు. 

హీమ్ ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు:

హీమ్ ఐరన్ బీఫ్, చికెన్, ఎగ్స్, ష్రింప్, సార్డీన్స్, ఓయిస్టర్స్ ఇలాంటి మాంసాహారంలో లభిస్తుంది. 

నాన్-హీమ్ ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు:

నాన్-హీమ్ ఐరన్ శనగలు, టోఫు, పాలకూర, బ్రోక్లీ, కందిపప్పు వంటి ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, అంజీర్, ఖర్జూరాలు, ద్రాక్ష, ఎండుద్రాక్ష, ఎండు బొప్పాయి, ప్రూన్స్ వంటి ఫ్రూట్స్ లో కూడా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.

Also Read: YS Jagan Odarpu Yatra: మరో ఓదార్పు యాత్ర.. వినుకొండ నుంచే వైఎస్‌ జగన్‌ మొదలు?

Also Read: AP Assembly Session: అసెంబ్లీకి వైఎస్ జగన్‌ వెళ్తారా? లేదా చంద్రబాబులా బహిష్కరిస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News